AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Esha Chawla: ఇన్నాళ్ల తర్వాత ఇలా..! స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ప్రేమకావాలి బ్యూటీ

హీరోయిన్స్ కొంతమంది పెళ్లి చేసుకొని సినీ కెరీర్ కు పులిస్టాప్ పెట్టారు. మరికొంతమంది ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యారు. అలాంటి భామల్లో ఈ చిన్నది కూడా ఒకరు. ఆ అమ్మడే ఇషా చావ్లా.. యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ప్రేమ కావాలి సినిమాతో హీరోయిన్ గా మరిచయం అయ్యింది తొలి సినిమాతోనే మంచి హిట్‌తో పాటు.. మంచి క్రేజ్ కూడా సొంతం చేసుకుంది.

Esha Chawla: ఇన్నాళ్ల తర్వాత ఇలా..! స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ప్రేమకావాలి బ్యూటీ
Esha Chawla
Rajeev Rayala
|

Updated on: Feb 28, 2024 | 3:46 PM

Share

చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే.. కనిపించకుండా పోతుంటారు. ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ మరో సినిమాలో కనిపించకుండా మాయమై పోవడం కొత్తేమి కాదు. హీరోయిన్స్ కొంతమంది పెళ్లి చేసుకొని సినీ కెరీర్ కు పులిస్టాప్ పెట్టారు. మరికొంతమంది ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యారు. అలాంటి భామల్లో ఈ చిన్నది కూడా ఒకరు. ఆ అమ్మడే ఇషా చావ్లా.. యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ప్రేమ కావాలి సినిమాతో హీరోయిన్ గా మరిచయం అయ్యింది తొలి సినిమాతోనే మంచి హిట్‌తో పాటు.. మంచి క్రేజ్ కూడా సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలో హీరోయిన్ గా నటించింది అలాగే సునీల్ హీరోగా నటించిన పూల రంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు లాంటి సినిమాలతో హిట్స్ అందుకుంది. ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. తెలుగులో సినిమాలకు దూరం అయ్యిన తర్వాత విరాట్ అనే కన్నడ సినిమాలో నటించింది.

ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకొని సడన్‌గా సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి తెలుగులో సినిమా చేయడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాతో.. ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఎస్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాతో ఇషా చావ్లా రీ ఎంట్రీ ఇవ్వనున్నారట.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న నయా మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఓ హీరోయిన్ గా ఇషా చావ్లా నటించనుందట. ఈ సినిమాను సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వశిష్ఠ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో స్టార్ హీరోయిన్ త్రిష జాయిన్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్డేట్స్ రానున్నాయి.

ఇషా చావ్లా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Esha Chawla (@eshachawla63)

ఇషా చావ్లా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Esha Chawla (@eshachawla63)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us