AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Preity Zinta : అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా సంచలన కామెంట్స్..

అలాగే కొన్నాళ్లుగా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహయజమానిగా వ్యవహరిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి బ్యాక్రౌండ్ లేకుండా నటీనటులుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయిలకు.. అబ్బాయిలకు బాలీవుడ్ అంత సేఫ్ కాదని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Preity Zinta : అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా సంచలన కామెంట్స్..
Preity Zinta
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2024 | 3:47 PM

Share

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ప్రీతీ జింటా. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని నటిగా ప్రశంసలు అందుకుంది . అలాగే హిందీ, తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్ళి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది ప్రీతీ జింటా. అలాగే కొన్నాళ్లుగా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహయజమానిగా వ్యవహరిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి బ్యాక్రౌండ్ లేకుండా నటీనటులుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయిలకు.. అబ్బాయిలకు బాలీవుడ్ అంత సేఫ్ కాదని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

“బాలీవుడ్ ఎలాంటి నేపథ్యం లేని అమ్మాయిలు లేదా అబ్బాయిలకు సురక్షితమైన ప్రదేశం కాదు. కేవలం ఫిల్మ్ బ్యాగ్రౌండ్ మాత్రమే కాదు.. ప్రముఖులతో పరిచయాలు కూడా ఉండాలి. ఎలాగైనా ఇండస్ట్రీలోని ప్రముఖులతో ఏదోకరకంగా పరిచయాలు ఉండాలి. అలాంటివాళ్లే ఇక్కడ రాణించగలరు. ఎందుకంటే ఇక్కడ ఏ పాత్ర ఇచ్చినా చేయడానికి ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. వాళ్లందరినీ దాటుకుని అవకాశం మనవరకు రావాలంటే మనకు బ్యాగ్రౌండ్ ఉండాలి. లేదంటే రోడ్డు మధ్యలో నిల్చొని ఏ కారు ఢీకొంటుందోనని భయపడుతున్నట్లుగా ఉంటుంది” అన్నారు.

హీరోయిన్ గా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే 2016లో అమెరికాకు చెందిన జీన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె చివరిసారిగా దేవోల్ తో కలిసి భయ్యాజీ చిత్రంలో నటించారు. వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకున్న ప్రీతీ జింటా ఇప్పుడు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్నారు. ప్రీతి సరోగసి ద్వార కవలలకు జన్మనిచ్చింది. ఇండస్ట్రీలోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు