Krishnam Raju Death : రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రజానాట్యమండలి నివాళి
ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతితో సినీలోకం మూగబోయింది. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కృష్ణం రాజు అనారోగ్యంతో కన్నుమూశారు
ప్రముఖ నటుడు కృష్ణంరాజు(Krishnam Raju) మృతితో సినీలోకం మూగబోయింది. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కృష్ణం రాజు అనారోగ్యంతో కన్నుమూశారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణవార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సినిమా తారలు, ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు రెబల్ స్టార్. నటనతో, డైలాగ్ డెలివరీతో కృష్ణం రాజు ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ నేడు( ఆదివారం) తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణంరాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమానులంతా కృష్ణం రాజు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాయిరు. కృష్ణంరాజు మృతి పై ప్రజానాట్యమండలి సంతాపం వ్యక్తం చేసింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అనేక సాంఘీక, పౌరాణిక, రాజకీయ, జానపద చిత్రాలలో విభిన్న పాత్రాలలో కధానాయకునిగా నటించి, సినిమా ప్రేక్షకులను రంజింప చేయటంలో అగ్రభాగాన నిలిచిన ప్రఖ్యాత నటులు ఉప్పలపాటి కృష్ణంరాజు మృతి సినిమా పరిశ్రమకు, ఆయన అభిమానులుకు తీవ్రమైన లోటు అని ప్రజానాట్యమండలి సినిమా శాఖ అధ్యక్షులు వందేమాతరం శ్రీనివాస్, కార్యదర్శి మద్దినేని రమేష్, కోశాధికారి డాక్టర్ మాదాల రవి లు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రాజకీయాలలో కూడా కృష్ణంరాజు గారు తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్నారని ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఇక కృష్ణం రాజు అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.