
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో హీరోగా, నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అటు డ్యాన్స్, ఇటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలను తెరకెక్కించిన ఆయన.. ఇప్పుడు హిందీలో బిజీగా ఉంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభు దేవా మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత తరం నటుల డాన్స్ నైపుణ్యాలపై ప్రశంసలను కురిపించారు. అందులో ప్రభుదేవా మాట్లాడుతూ ఆయన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల అద్భుతమైన డాన్స్ ప్రతిభ గురించి మాట్లాడారు.
ఎక్కువ మంది చదివినవి : Rajamouli : ఆ హీరో చాలా గొప్పోడు.. సినిమా కోసం తన జీవితాన్నే ఇచ్చేశాడు.. రాజమౌళి కామెంట్స్..
ప్రభుదేవా మాట్లాడుతూ.. నేటి తరం యువ హీరోలు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు అద్భుతంగా డాన్స్ చేస్తున్నారని, వారి డాన్స్ నైపుణ్యాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అన్నారు. తనను ఒకరిని దృష్టిలో పెట్టుకుని డాన్స్ కంపోజ్ చేయమంటే, అది చాలా క్రియేటివ్ గా ఉంటుందని చెప్పారు. తాను జూనియర్ ఎన్టీఆర్‌తో సాంబా అనే ఒకే ఒక పాటలో పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఆ పాటలో ఎన్టీఆర్ డాన్స్ సూపర్… హి ఈజ్ సంథింగ్ ఎల్స్ అని ప్రభుదేవా ప్రశంసించారు. అల్లు అర్జున్‌తో ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనకు పనిచేశానని, కానీ ఆ ప్రకటనలో ఆయన డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం రాలేదని వివరించారు. అయితే, టీవీలో అల్లు అర్జున్ డాన్స్ చూసినప్పుడు అది ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందని పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటి.
ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్స్ అనేది హీరోలకు ఒక ప్రాథమిక అర్హతగా మారిందని ప్రభుదేవా అన్నారు. ఒక హీరో అంటే పోరాటాలు చేయడంతో పాటు డాన్స్ కూడా చేయగలగాలి అనే స్థాయికి వచ్చిందని వివరించారు. పాటలకు, ముఖ్యంగా డాన్స్‌కు ఎంతో ప్రాముఖ్యత పెరిగిందని, దీని కోసం 24 గంటల ఛానెల్స్ కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమలోనే తాను తన ప్రస్థానాన్ని ప్రారంభించానని, ఇక్కడ సుమారు 80 చిత్రాలకు పనిచేశానని చెప్పారు. ఈ పరిశ్రమలో తనకు ఎప్పుడూ సౌకర్యంగానే అనిపించిందని, తాను 14, 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు సౌకర్యవంతంగా ఉందా లేదా అనేది కూడా తనకు తెలియదని అన్నారు. షూటింగ్ సమయంలో కూడా క్రికెట్ ఆడుతూ ఆనందంగా గడిపానని, ఎప్పుడూ అసౌకర్యంగా భావించలేదని గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
Prabhu Deva, Jr Ntr
ఎక్కువ మంది చదివినవి : Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..