Salaar Movie: డైనోసార్ ఆగయా.. ‘సలార్’ ప్రమోషన్స్ స్టార్ట్.. ఫస్ట్ డే ఫస్ట్ షో అప్పుడే..
కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో ప్రభంజనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశారు. ఇన్నాళ్లు కేజీఎఫ్ సినిమాతో లింక్ ఉంటుందన్న రూమర్స్‌కు సైతం చెక్ పెట్టేశారు నీల్. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా శత్రువులుగా మారారు అన్నది సలార్ స్టోరీ లైన్.

మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో ప్రభంజనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశారు. ఇన్నాళ్లు కేజీఎఫ్ సినిమాతో లింక్ ఉంటుందన్న రూమర్స్‌కు సైతం చెక్ పెట్టేశారు నీల్. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎలా శత్రువులుగా మారారు అన్నది సలార్ స్టోరీ లైన్. ఇందులో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా ? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
తాజాగా సలార్ అప్డేట్ గురించి ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ను భారతదేశంలో డిసెంబర్ 22న ఉదయం 12.30 గంటలకు విడుదల చేసే అవకాశం ఉందట. ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళలో డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కేరళ అంతటా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే కేరళలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. నివేదికల ప్రకారం కేరళలలో సలార్ ప్రమోషన్స్ షూరు అయ్యాయని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
View this post on Instagram
మొదటిసారి ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రాబోతున్న సలార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు. వారిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సలార్ ఫస్ట్ పార్ట్ లో చూపించనున్నారు. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300లకు పైగా స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొట్టాయంలోని ప్రముఖ థియేటర్లో విడుదల రోజున అంటే డిసెంబర్ 22న ఉదయం 6 గంటలకు ఫస్ట్ షో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయనున్నారు.
THE MOST VIOLENT MEN… CALLED ONE MAN… THE MOST VIOLENT!#SalaarTrailer ▶️ https://t.co/TBUEgQJA3H#Salaar #SalaarCeaseFire #SalaarCeaseFireOnDec22#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy @bhuvangowda84… pic.twitter.com/seTHuvFWVg
— Hombale Films (@hombalefilms) December 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
