యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న లేటేస్ట్ చిత్రం ఆదిపురుష్. రామయాణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన టీజర్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సీతారామ పాత్రలతోపాటు.. రావణుడి గెటప్ పై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై సినీప్రియులు పెదవి విరిచారు. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ వరకు వాయిదా వేశారు. 3డీతోపాటు.. వీఎఫ్ఎక్స్ లోనూ పలు మార్పులు చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక తాజాగా ఈ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు డైరెక్టర్ ఓంరౌత్.
అసలు విషయమేంటంటే.. సినీరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఇది గౌరవం, సంతోషానికి మించింది. 2023 జూన్ 13న ఆదిపురుష్ న్యూయార్క్ లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతుంది. ఈ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. నా చిత్ర బృందానికి నేను కృతజ్ఞుణ్ని . ఆ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అంటూ ఓంరౌత్ ట్వీట్ చేశారు. ఆ వేడుక జూన్ 7 నుంచి 18 వరకు జరగనుంది.
ప్రభాస్ కెరీర్లోనే తొలి ఇతిహాసం ఆధారంగా వస్తోన్న చిత్రమిది. భారీ బడ్జేట్ తో 3డీలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ పళని ఫోటోగ్రఫి అందిస్తుండగా.. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.