Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ బీ రెడీ.. ‘ఆదిపురుష్’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

కానీ గతంలో విడుదలైన టీజర్ అభిమానులను నిరాశపరిచింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో సినీ ప్రియులు పెదవి విరిచారు.

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ బీ రెడీ.. 'ఆదిపురుష్' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
Adipurush Movie
Follow us

|

Updated on: Feb 25, 2023 | 12:28 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉన్న డార్లింగ్.. మరోవైపు కొత్త ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ శ్రుతి హాసన్ సలార్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడంతో.. మరోసారి డార్లింగ్ చిత్రాలపై క్యూరియాసిటీ నెలకొంది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా రాముడి పాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. కానీ గతంలో విడుదలైన టీజర్ అభిమానులను నిరాశపరిచింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో సినీ ప్రియులు పెదవి విరిచారు. దీంతో చిత్రయూనిట్ వెనక్కు తగ్గింది. వీఎఫ్ఎక్స్ లో మార్పులు చేసి త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది.

గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆదిపురుష్ సినిమా నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఆదిపురుష్ ఫస్ట్ సింగిల్ మార్చ్ చివరలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం ఇప్పుడే సన్నహాలు చేస్తున్నారని. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు బాలీవుడ్ ఫేమస్ కంపోజర్స్ అజయ్ అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇదే కాకుండా..ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్, డార్లింగ్ కాంబోలో ప్రాజెక్ట్ కె రాబోతుంది. మరోవైపు.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.