Prabhas : సైనికుడిగా రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ సీన్స్‌కు థియేటర్స్ దద్దరిల్లాల్సిందేనట..

|

Jul 26, 2024 | 2:13 PM

దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ అందుకున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తీసుకురానున్నారు. మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు సలార్2 పై అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే తాజాగా కల్కి సినిమాతో సంచలన విజయం సాధించింది.

Prabhas : సైనికుడిగా రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ సీన్స్‌కు థియేటర్స్ దద్దరిల్లాల్సిందేనట..
Prabhas
Follow us on

ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ అందుకున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తీసుకురానున్నారు. మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు సలార్2 పై అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే తాజాగా కల్కి సినిమాతో సంచలన విజయం సాధించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది. కల్కి సినిమా ఏకంగా 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది.

ఇది కూడా చదవండి : ఛత్రపతి నటుడు భార్య గురించి తెలుసా.? ఆమె చాలా ఫేమస్ నటి

ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రాజా సాబ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోనూ సినిమా చేస్తున్నాడు మన రెబల్ స్టార్. వీరితో పాటు సీతారామంలాంటి కల్ట్ లవ్ స్టోరీతో హిట్ అందుకున్న హనురాఘవాపుడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

ఇది కూడా చదవండి : Bigg Boss Season 8: పెద్ద ప్లానే..! హౌస్ మొత్తం హాట్ బ్యూటీలే.. లిస్ట్‌లోకి మరో అమ్మడు..

అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తుంది. నిజంగా ఇదే కథతో సినిమా వస్తే మాత్రం థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ నేపథ్యంలో ఉంటుంది తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడిగా అలాగే సైనికుడిగా కనిపిస్తాడని అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉండనున్నాయని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఆర్మీని స్థాపించి బ్రిటీష్ పై పోరాడారు. ఆ ఆర్మీలో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ ను కూడా చూపించనున్నారని తెలుస్తోంది. సుభాష్ చంద్రబోస్ ను చూపించే సన్నివేశం నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని.. థియేటర్స్ దద్దరిల్లుతాయి అని అంటున్నారు. అలాగే ఈ సినిమాకు ఫౌజి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో పాకిస్థాన్ నటి హీరోయిన్ గా చేస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తల పై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి