The Raja Saab Twitter Review: ది రాజా సాబ్ ట్విట్టర్ రివ్యూ.. ప్రభాస్ సినిమాపై అడియన్స్ రియాక్షన్ ఇది..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ది రాజాసాబ్ సందడి మొదలైంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత అడియన్స్ ముందుకు వచ్చేశారు ప్రభాస్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ నటించిన హారర్ థ్రిల్లర్ ఇది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా విడుదలైంది.

The Raja Saab Twitter Review: ది రాజా సాబ్ ట్విట్టర్ రివ్యూ.. ప్రభాస్ సినిమాపై అడియన్స్ రియాక్షన్ ఇది..
Raja Saab

Updated on: Jan 09, 2026 | 12:40 PM

ఎట్టకేలకు మోస్ట్ అవైటెడ్ మూవీ రాజా సాబ్ అడియన్స్ ముందుకు వచ్చేసింది. చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హారర్ థ్రిల్లర్ డ్రామాను ఈరోజు విడుదల చేయనున్నారు. కానీ నిన్న రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ షోలతోపాటు అదనపు రేట్లు పెంచుకోవడానికి అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం సైతం.. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. జనవరి 9న ఈ సినిమా విడుదలైంది. కానీ అంతుకు ముందు రోజే అంటే గురువారం రాత్రి ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ చూసిన అడియన్స్ సినిమా ఎలా ఉంది.. ? ప్రభాస్ హిట్టు కొట్టాడా.. ? డార్లింగ్ నమ్మకాన్ని డైరెక్టర్ మారుతి నిలబెట్టుకున్నాడా ? అనే విషయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

ఇవి కూడా చదవండి

ది రాజాసాబ్ సినిమాలో ఫస్టాఫ్ అదిరిపోయిందని.. ముఖ్యంగా ఈ మూవీలో ప్రభాస్ లుక్.. ఎంట్రీ సీన్ సూపర్బ్ అంటున్నారు. అలాగే చాలా కాలం తర్వాత ప్రభాస్ డ్యాన్స్ ఊహించలేదని.. అభిమానులకు ఇది ఫుల్ ట్రీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..

ప్రభాస్ వింటేజ్ బాడీ లాంగ్వేజ్, వింటేజ్ ఎనర్జీ డ్యాన్సులు, కామెడీ సీన్స్ ఈ సినిమాకు మరో హైలెట్ అని అంటున్నారు. రాజా సాబ్ సినిమా ఈ సంక్రాంతికి ప్రభాస్ అభిమానులకు ఫుల్ ట్రీట్ అని.. టైటిల్ కార్డ్, ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అంటున్నారు. అలాగే ఈ సినిమా మాళవిక మాస్ యాక్షన్ నటనకు ఫిదా అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..