Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సోమవారం కల్కి ట్రైలర్.. HYDలోని ఈ థియేటర్లలో స్క్రీనింగ్

|

Jun 09, 2024 | 8:03 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సోమవారం కల్కి ట్రైలర్.. HYDలోని ఈ థియేటర్లలో స్క్రీనింగ్
Kalki 2898 Ad Movie
Follow us on

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే మరో బ్యూటీ ది షా పటానీ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజిబిజీగా ఉంది. ఇందులో భాగంగా సోమవారం (జూన్ 10) ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుంది. ఈ తరుణంలో ట్రైలర్‌ తీసుకొచ్చే ముందు సినిమాకు సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను ఆదివారం (జూన్ 09) రివీల్ చేశారు మేకర్స్. సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కొత్త లుక్ ను ఆడియెన్స్ కు పరిచయం చేసింది. ‘నమ్మకం ఆమెతోనే మొదలవుతుంది’ అంటూ దీనికి క్యాప్షన్ తీసుకొచ్చింది. అలాగే పోస్టర్ లో ‘ప్రతీది మారాల్సిందే” అని రాసి ఉంది.

కాగా కల్కి 2898 ఏడీ సినిమా ట్రైలర్‌ సోమవారం (జూన్ 10) ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే ప్రదర్శితం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ నగరాల్లో.. ఏ థియేటర్లలో కల్కి ట్రైలర్ ప్లే అవుతుందో లిస్టును కూడా వెల్లడించింది చిత్ర బృందం. ఆయా థియేటర్లలో సోమవారం సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ స్క్రీనింగ్ ఉంటుందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ లో కల్కి ట్రైలర్ స్క్రీనింగ్ థియేటర్లు ఇవే

1. సంధ్య 70 MM- ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్

2. కోణార్క్- దిల్ సుఖ్ నగర్

3. భ్రమరాంబ- కేపీహెచ్‌బీ

4.జ్యోతి- ఆర్‌ సీ పురం

5. అర్జున్- కేపీహెచ్‌బీ

6. రాజ్యలక్ష్మి- ఉప్పల్

7.భుజంగ-జీడి మెట్ల

8. సాయిరాం- మల్కాజిగిరి

9.రాధిక-ఈసీఐఎల్

10. వైజయంతీ- నాచారం

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.