AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఆసుపత్రిలో ప్రభాస్.. వైరలవుతున్న వీడియో.. అసలు విషయమేంటంటే..

తాజాగా ప్రభాస్ ఆసుపత్రిలో నుంచి బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఓ హాస్పిటల్ లో ప్రభాస్ అలా నడిచి వస్తున్నాడు.

Prabhas: ఆసుపత్రిలో ప్రభాస్.. వైరలవుతున్న వీడియో.. అసలు విషయమేంటంటే..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Sep 10, 2022 | 5:55 PM

Share

పాన్ ఇండియా లెవల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏కు (Prabhas) ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఈ స్టార్ హీరో సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఇక అతనికి సంబంధించిన ప్రతి చిన్న విషయం నెట్టింట వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. ఆ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ ఆసుపత్రిలో నుంచి బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో ఓ హాస్పిటల్ లో ప్రభాస్ అలా నడిచి వస్తున్నాడు.

అయితే ఈ వీడియోల్ పాతతి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు లేదు కొత్తది అని.. కృష్ణంరాజును కలవడానికి వెళ్లారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే… డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రభాస్ కాంబోలో ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. దీపికా పదుకొణె నటిస్తున్నారు. ఇటీవల డార్లింగ్ డైరెక్టర్ హాను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us