Prabhas: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..! హైదరాబాద్‌లోనే గ్రాండ్‌ ఈవెంట్‌!

'బాహుబలి' సిరీస్‌, 'సాహో' సినిమాల తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ నటిస్తున్న  మరో పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్‌'. పూజాహెగ్డే డార్లింగ్‌తో రొమాన్స్‌ చేయనుంది.

Prabhas: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..! హైదరాబాద్‌లోనే గ్రాండ్‌ ఈవెంట్‌!
Follow us
Basha Shek

|

Updated on: Dec 15, 2021 | 9:07 AM

‘బాహుబలి’ సిరీస్‌, ‘సాహో’ సినిమాల తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ నటిస్తున్న  మరో పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే డార్లింగ్‌తో రొమాన్స్‌ చేయనుంది. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వింటేజ్‌ అండ్‌ పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గ్లింప్స్‌, పాటలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. వరుసగా అప్డేట్‌ ఇస్తోంది.

తాజాగా ఈ సినిమా ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ తేదీ కూడా ఫిక్సైందని సమాచారం. డిసెంబర్ 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంతో గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వేడుకకు చీఫ్‌ గెస్టుగా ఎవరురానున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా తెలుగుతో సహా మొత్తం 7 భాషల్లో ఈ పాన్‌ ఇండియా సినిమా విడుదల కానుంది. ప్రభాస్‌, పూజలతో పాటు కృష్ణం రాజు, భాగ్యశ్రీ, సచిన్‌ కేడ్కర్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు.

Also Read:

Leena Nair: మరో అంతర్జాతీయ సంస్థకు బాస్ గా భారతీయ మహిళ .. ‘చానెల్‌’ సీఈవోగా లీనా నాయర్‌..

రోజుకు 20 రూపాయలు డిపాజిట్‌ చేస్తే కోటీశ్వరులు కావొచ్చు.. డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి

Actor Sunil: విలన్‌గా నటించాలనే కోరిక ఇన్నాళ్లకు తీరింది.. ఏ టైప్ పాత్రలు ఏ భాషలో వచ్చినా చేస్తా: సునీల్