AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam Trailer: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాధేశ్యామ్ ట్రైలర్..

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది

Radhe Shyam Trailer: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రాధేశ్యామ్ ట్రైలర్..
Radheshyam
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2022 | 9:24 PM

Share

Radhe Shyam : రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్ లో వేగం పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవలే ముంబైలో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఈ రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ముఖ్యంగా అత్యద్భుతమైన విజువల్స్‌తో నిమిషం నిడివి గల ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈట్రైలర్లో సినిమా ఎలా ఉండబోతుందో.. ఎంత ఘనంగా ఉండబోతుందో చూపించారు. ప్రేమకు, విధిరాతకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథ. ఓ విధంగా సినిమాకు కర్టెన్ రైజర్ ఇది. సినిమాపై అంచనాలు రెండింతలు పెంచేసింది. ఇప్పుడు ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు ట్రైలర్ 7 మిలియన్ కు పైగా వ్యూస్ ను దక్కించుకుంది.

చిత్ర యూనిట్‌తో కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ చేయనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాలన్నీ తిరగనున్నారు. దీని కోసం పూర్తిగా బిజీ షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు ప్రభాస్. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తెలుగులో పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఎన్నడూ లేనంత బిగ్గెస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇండియా, ఓవర్సీస్‌లో అత్యంత ఘనంగా ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యూవీ క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. మార్చ్ 11, 2022న సినిమా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss OTT: ప్రేక్షకులకు షాక్.. ఆగిపోయిన బిగ్‏బాస్ నాన్‏స్టాప్.. కారణం చెప్పిన నిర్వాహకులు..

Rana Daggubati: అసలు హీరో అంటే ఏంటో తెలిసింది.. ఈ సినిమాకు ఆయనే వెన్నెముక.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్..

కొమ్ములు దూస్తూ.. కాలు దువ్వుతూ.. కోడెలు దూసుకొస్తున్న వేళ
కొమ్ములు దూస్తూ.. కాలు దువ్వుతూ.. కోడెలు దూసుకొస్తున్న వేళ
ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
ఈ రూట్స్‌లో ప్రత్యేక రైళ్ల పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?
మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకంటే?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
వాకింగ్ vs మెట్లెక్కడం.. ఏది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది?
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
ఇండోర్‌లో 'హిట్‌మ్యాన్' తుఫాన్..! కివీస్ బౌలర్లకు చుక్కలే..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు