ప్రభాస్ ఆరోగ్యంపై తరచూ వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా కోసం భారీగా బరువు పెరగడం, ఆ తర్వాత సాహో కోసం మళ్లీ స్లిమ్‌గా మారడం, భారీ యాక్షన్ సీక్వెన్స్ చేయడంతో ప్రభాస్ హెల్త్ దెబ్బతిన్నట్లు రూమర్లు వచ్చాయి. ఇక ఆదిపురుష్ సినిమా షూటింగ్‌లో పాన్ ఇండియా స్టార్ మోకాళ్లకు సర్జరీ చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా మరోసారి ప్రభాస్ ఆరోగ్యంపై వార్తలు గుప్పుమంటున్నాయి. ఈసారి తన ఆరోగ్య సమస్య కారణంగా తీవ్ర ఇబ్బంది పడటంతో.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది. అయితే అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని..జస్ట్ క్యాజువల్ హెల్త్ చెకప్ కోసం వెళ్లినట్లు ప్రభాస్ టీమ్ చెబుతోంది. మరోవైపు ఈ యంగ్ రెబల్ స్టార్‌పై టాలీవుడ్‌కి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తన హెల్త్ కోసం కొన్నాళ్ల పాటు సినిమా షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చే పనిలో ఉన్నాడట. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాధేశ్యామ్ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. పెద్దనాన్న కృష్ణం రాజు మరణం తర్వాత కొద్ది రోజులు మాత్రమే గ్యాప్ తీసుకుని మళ్లీ షూటింగ్స్‌లో జాయిన్ అయ్యాడు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌తో పాటు మారుతి సినిమా షూటింగ్స్లలోనూ రెగ్యులర్‌గా పాల్గొంటున్నాడు ప్రభాస్. మరోవైపు మధ్య మధ్యలో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ షూట్‌కు హాజరవుతున్నాడు. మరోవైపు ఆదిపురుష్ కూడా లైన్‌లో ఉంది. అలాగే సందీప్ రెడ్డితో స్పిరట్ సినిమాకు కూడా ఓకే చెప్పాడు. ఇలా పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ డైరీ ఫుల్ అయిపోయింది. కాగా ఇటీవల ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కూడా గాయపడ్డాడు. ఇక ప్రభాస్ తో పాటు అమితాబ్ కోలుకున్న తర్వాతే ప్రాజెక్ట్ కె షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..