Adipurush: ‘ఆదిపురుష్’కు త్రీడి టీజర్ బాగానే వర్కౌట్ అయ్యిందే.. పాజిటివ్ టాక్ పెరిగింది

|

Oct 07, 2022 | 7:39 PM

అందుకే విమర్శలకు సమాధానం ఇచ్చారు దర్శకుడు ఓం రౌత్. ఆదిపురుష్ ఆడియన్స్‌ను డిజప్పాయింట్‌ చేయదన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఓం.

Adipurush: ఆదిపురుష్కు త్రీడి టీజర్ బాగానే వర్కౌట్ అయ్యిందే.. పాజిటివ్ టాక్ పెరిగింది
Adipurush
Follow us on

ఆదిపురుష్ టీజర్ రిలీజ్‌ తరువాత డార్లింగ్ ఫ్యాన్స్ డైలామాలో పడ్డారు. ఈ సినిమా గ్రాఫిక్స్‌ విషయంలో విమర్శలు వినిపించటంతో సినిమా కంటెంట్ మీద అనుమానాలు ఏర్పడ్డాయి. అందుకే విమర్శలకు సమాధానం ఇచ్చారు దర్శకుడు ఓం రౌత్. ఆదిపురుష్ ఆడియన్స్‌ను డిజప్పాయింట్‌ చేయదన్న కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఓం. మోస్ట్ అవెయిటెడ్ ఆదిపురుష్ టీజర్‌ను దసరా పండుగకు కాస్త ముందుగానే రిలీజ్ చేశారు మేకర్స్‌. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండుగ సెలబ్రేషన్స్ కాస్త ముందుగానే వస్తాయనుకున్నారు ఫ్యాన్స్. కానీ టీజర్ రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయ్యింది. టీజర్‌లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని, కార్టూన్ సినిమాలా ఉందన్న కామెంట్స్‌ వినిపించాయి. దీంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు.

టీజర్ విషయంలో వస్తున్న విమర్శలపై దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. ఆదిపురుష్ సినిమాను పూర్తిగా బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ కోసమే తెరకెక్కించామన్న ఓం… పెద్ద తెర మీద సినిమా చూస్తే ఆ థ్రిల్ మరోలా ఉంటుందన్నారు. మొబైల్‌ స్క్రీన్‌లో ఫుల్‌ క్వాలిటీ ఎంజాయ్ చేయలేమన్నారు ఓం రౌత్ . ఇప్పటికే బాలీవుడ్ మీడియా కోసం 3డీ ట్రయలర్‌ను ప్రదర్శించారు. ఈ షో తరువాత ఆదిపురుష్ టీజర్ మీద పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. త్రీడిలో విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయంటున్నారు నార్త్ జనాలు.

ఇప్పుడు సౌత్‌లో కూడా పాజిటివ్ కామెంట్సే వినిపిస్తున్నాయి. ఓం కామెంట్స్‌తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. టీజర్ టైమ్‌లో నిరాశపరిచినా… బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్‌కు బిగ్‌ ఎక్స్‌పీరియన్స్ పక్కా అని నమ్ముతున్నారు. మరి ఈ నమ్మకాన్ని ఓం నిలబెట్టుకుంటారా.. లెట్స్ వెయిట్‌ అండ్ సీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి