AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthikeya 2: ఓటీటీలోనూ అదే దూకుడు.. దుమ్మురేపుతోన్న కార్తికేయ 2 డిజిటల్‌ స్ట్రీమింగ్‌..

నిఖిల్‌ హీరోగా చందదూ మొండేటీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని..

Karthikeya 2: ఓటీటీలోనూ అదే దూకుడు.. దుమ్మురేపుతోన్న కార్తికేయ 2 డిజిటల్‌ స్ట్రీమింగ్‌..
Karthikeya 2 Ott
Narender Vaitla
|

Updated on: Oct 07, 2022 | 7:18 PM

Share

నిఖిల్‌ హీరోగా చందదూ మొండేటీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయాన్ని అందుకుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. ఏకంగా రూ. 100 కోట్లు రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడిగా అనుపమ పరమేశ్వరన్‌ నటించిన విషయం తెలిసిందే.

ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా తెలుగు స్థినిమా స్థాయిని మరోసారి జాతీయ స్థాయిలో చాటింది. ఇక వెండితెరపై వండర్స్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా డిజిటల్‌ స్క్రీన్‌పై కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది. కార్తికేయ 2 అక్టోబర్‌ 5వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో దూకుడు మీదుంది. థియేటర్స్‌లో సినిమా మిస్‌ అయిన వారు, మరోసారి ఓటీటీలో చూస్తోన్న వారితో కార్తికేయ2 స్ట్రీమింగ్‌ దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో ఓటీటీలో విడుదలైన కేవలం రెండంటే రెండు రోజుల్లోనే ఏకంగా 100 కోట్లకుపై స్ట్రీమింగ్‌ నిమిషాలతో సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా తెలిపింది. ఇంత తక్కువ సమయంలో అన్ని కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలు సాధించి కార్తికేయ 2 సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక ఈ సినిమాకు 3వ భాగం కూడా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..