AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Ghost: డీసెంట్ కలెక్షన్స్‌తో రాణిస్తున్న ‘ది ఘోస్ట్’… రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే

యాక్షన్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను తెరకెక్కించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించారు.

The Ghost: డీసెంట్ కలెక్షన్స్‌తో రాణిస్తున్న 'ది ఘోస్ట్'... రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే
The Ghost
Rajeev Rayala
|

Updated on: Oct 07, 2022 | 5:25 PM

Share

అక్కినేని నాగార్జున ఫుల్ జోష్ గా దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో జోరుమీదున్న నాగార్జున రీసెంట్ గా ది ఘోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాను తెరకెక్కించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా కనిపించారు. ఇక ఘోస్ట్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాగార్జున నటన, యాక్షన్ సీక్వెన్స్ లు హైలైట్ గా నిలిచాయని అంటున్నారు ప్రేక్షకులు. ఈ మూవీలో నాగ్ కు జోడిగా సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని ‘శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’, ‘నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్’ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఈ సినిమా దసరా కానుకగా  విడుదలైంది. ఇక ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ తోపాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ది ఘోస్ట్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే డీసెంట్ ఓపినింగ్స్ రాబట్టింది. అలాగే రెండో రోజుకూడా ఈ మూవీ మంచి వసూళ్లను సాధిస్తోంది.

నైజాం 0.79 కోట్లు,  సీడెడ్ 0.39 కోట్లు, ఉత్తరాంధ్ర 0.47 కోట్లు, ఈస్ట్ 0.28 కోట్లు, వెస్ట్ 0.12 కోట్లు, గుంటూరు 0.27 కోట్లు, కృష్ణా 0.23 కోట్లు, నెల్లూరు 0.17 కోట్లు, ఏపీ – తెలంగాణ (టోటల్) 2.72 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.23 కోట్లు, ఓవర్సీస్ 0.35 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 3.30 కోట్లు రాబట్టింది ఘోస్ట్ మూవీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
పార్శిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై రీఫండ్ పొందే అవకాశం..
పార్శిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై రీఫండ్ పొందే అవకాశం..
9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీ కెమెరాల్లో చూసి ఆగ్రహించిన..
9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీ కెమెరాల్లో చూసి ఆగ్రహించిన..