Prabhas: నెట్టింట వైరలవుతోన్న హీరో ప్రభాస్ ఆధార్‌ కార్డు.. డార్లింగ్ పేరేంటి ఇంత పొడవుగా ఉంది

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజి బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో సుమారు అరడజనకు పైగా సినిమాలున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఆధార్ కార్డు అంటూ ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Prabhas: నెట్టింట వైరలవుతోన్న హీరో ప్రభాస్ ఆధార్‌ కార్డు.. డార్లింగ్ పేరేంటి ఇంత పొడవుగా ఉంది
Prabhas

Updated on: Sep 06, 2025 | 7:43 PM

గతేడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్ కామెడీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా స్పిరిట్, ఫౌజి, సలార్2, కల్కి2 ఇంకా చాలా సినిమాలు ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించిన ఒక విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. అదేంటంటే.. ప్రభాస్ ఆధార్ కార్డు అంటూ ప్రస్తుతం ఒక చిన్న వీడియో నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. ఈ ఆధార్ కార్డు ప్రకారం ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్. అతని పుట్టిన తేది 23-10-1979గా ఉంది. ఇందులో కనిపించిన ఆధార్ నంబర్: 5986 6623 9932. అయితే ఇది ఒరిజినల్ నా? లేక ఫేకా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే మొత్తానికి సోషల్ మీడియాలో ఇది బాగా వైరలవుతోంది. దీనిని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డులో ప్రభాస్ అప్పటి లుక్ చూసి మురిసిపోతున్నారు. ఆధార్ పిక్ లో కూడా డార్లింగ్ హ్యాండ్సమ్ గా ఉన్నాడే! అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఈ ఆధార్ కార్డు ప్రకారం ప్రభాస్ పుట్టిన తేదీ 23-10-1979 అని ఉంది. అంటే ఇప్పుడు డార్లింగ్ వయసు సుమారు 46 సంవత్సరాలు అని తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికీ బ్యాచిల‌ర్‌గానే ఉన్నాడు. అభిమానులు మాత్రం తమ హీరో పెళ్లెప్పుడు చేసుకుంటాడా? ఎవరితో ఏడడుగులు నడుస్తాడా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా ఈ హీరో పెళ్లి చూడాలని ఆత్రుతగా ఉన్నానంటున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట చక్కర్లు కొడుతోన్న ప్రభాస్ ఆధార్ కార్డ్ ఇదే..

ది రాజా సాబ్ సెట్ లో ప్రభాస్, థమన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..