AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2 డైలాగ్ లీక్.. నెట్టింట వైరలవుతున్న పుష్పరాజ్  పవర్ ఫుల్  డైలాగ్..

పుష్ప 2 మూవీలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి కొన్ని డైలాగ్స్ లీకయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Pushpa 2: పుష్ప 2 డైలాగ్ లీక్.. నెట్టింట వైరలవుతున్న పుష్పరాజ్  పవర్ ఫుల్  డైలాగ్..
Pushpa 2
Rajitha Chanti
|

Updated on: Dec 11, 2022 | 3:23 PM

Share

డైరెక్టర్ సుకుమార్… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‏లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బన్నీ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ఇక ఇటీవల పుష్ప చిత్రాన్ని రష్యాలోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సిక్వెల్ గా రాబోతున్న పుష్ప 2పై కూడా ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఓకేసారి అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 మూవీలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి  అల్లు అర్జున్ చెప్పే కొన్ని డైలాగ్స్ లీకయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే ?.. పులి వచ్చిందని అర్థం. అదే పులు నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం” అనే లెంగ్తీ డైలాగ్ లీక్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే.. “వాళ్లు గొర్నెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొరెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” అంటూ పుష్పరాజ్ డైలాగ్ చెప్పనున్నాడట. ఇలాంటి లెంగ్తీ డైలాగ్స్ చాలానే లీక్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ డైలాగ్స్ లీక్స్ పై ఇప్పటివరకు చిత్రయూనిట్ స్పందించలేదు.

ఇక డిసెంబర్ 16న పుష్ప 2 గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా లో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us