Pawan Kalyan: పవన్ కళ్యాణ్ భారీ ప్రాజెక్ట్‌ల పరిస్థితేంటి..? కొత్త సినిమాలు పవర్ స్టార్ ఓకే చేస్తారా.?
పవన్ కల్యాణ్ అభిమానులు ఊహించని పరిణామం జరగబోతోందా..? పవన్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టి.. సినిమాల నుంచి దూరం జరిగే ప్రయత్నాలు చేస్తున్నారా? అనే డౌట్ క్రియేట్ అవుతోంది. తాజాగా అన్నమయ్య జిల్లాలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ అభిమానులు..ఓజీ, ఓజీ అంటూ నినాదాలు చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన ఈ కామెంట్స్..అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. తనకు సినిమా కంటే.. దేశం, సమాజం ముఖ్యమని తేల్చిచెప్పేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ కామెంట్స్ చూస్తుంటే.. పవన్ కల్యాణ్ అభిమానులు ఊహించని పరిణామం జరగబోతోందా..? పవన్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టి.. సినిమాల నుంచి దూరం జరిగే ప్రయత్నాలు చేస్తున్నారా? అనే డౌట్ క్రియేట్ అవుతోంది. తాజాగా అన్నమయ్య జిల్లాలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ అభిమానులు..ఓజీ, ఓజీ అంటూ నినాదాలు చేశారు. సుజిత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ ఓజీ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అభిమానాలు నినాదాలపై స్పందించిన పవన్ కల్యాణ్.. తనకు సినిమాల కన్నా సమాజం, దేశమే ముఖ్యమన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయన్నారు. దాంతో పవన్..ఇక సినిమాలకు పూర్తిగా దూరం జరగనున్నారన్న..ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
ఇప్పుడు సినిమాల కంటే సమాజమే ముఖ్యమనడం చూస్తుంటే పవన్ ఇకపై కొత్త సినిమాల్లో నటించరా అన్న అనుమానాలు పుట్టుకొస్తున్నాయి అభిమానుల్లో. పవన్ కల్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో ‘హరి హర వీరమల్లు’ రెండు పార్టులతో పాటు ..ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ఓజీ నుంచి..వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఎక్స్‌పర్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. అలాగే రూ.200 కోట్లతో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు ఫస్ట్‌పార్ట్, రూ.150 కోట్లతో రూపొందుతున్న ఉస్తాద్ భగత్‌సింగ్ కూడా ప్యాన్ ఇండియా మూవీలే. ఈ మూవీలపై కనీసం 2 వేల నుంచి 3 వేల కోట్ల రూపాయల బిజినెస్ ఆశిస్తున్నారు.
వీరమల్లు మూవీ షూటింగ్ స్టార్టయి 4 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు దాని రిలీజ్ గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. దాని షూటింగ్ కూడా చాలా బ్యాలెన్స్ ఉంది. ఓజీ పరిస్థితి మాత్రం కాస్త బెటర్. మరో రెండు వారాలు డేట్స్ ఇస్తే ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నారు..డైరెక్టర్‌సుజిత్. తాజాగా నిర్మాత డీవీవీ దానయ్యతో పాటు సుజిత్‌ను కలిసి డేట్స్ విషయం పవన్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే వీరమల్లు టీమ్‌తో కూడా పవన్ కళ్యాణ్ చర్చలు సాగాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యూచర్ మాత్రం ప్రస్తుతం కన్ఫ్యూజన్‌లో ఉంది. ఈ సినిమాకు పవన్ డేట్స్ ఇస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా ఉంది. అయితే ఇప్పటికే ఆయా సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్ తీసుకున్నారు..పవన్ కల్యాణ్. వాటిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత పవన్‌పై ఉంది. దీంతో అవి పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్.. కొత్త సినిమాలు ఒప్పుకోవడం డౌటే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



