పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. మొన్నామధ్య సినిమాలకు చిన్న గ్యాప్ తీసుకున్న పవన్ ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమా తో తిరిగి ఫామ్ లోకి వచ్చారు. రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ చేసిన రెండు సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. వకీల్ సాబ్ తర్వాత చేసిన బీమ్లానాయక్ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది.అయితే పవన్ లైనప్ చేసిన సినిమాల్లో క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ఒకటి. పవన్ కెరీర్ లో వస్తోన్న హై బడ్జెట్ మూవీ ఇది. మొగలాయిలా కాలం నాటి కథతో క్రిష్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని టాక్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది.
తాజాగా మరోసారి ఈ సినిమాకు బ్రేక్ పడింది . ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా 65 శాతం పూర్తయ్యింది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గ్లిడ్ ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు మరోసారి హరిహర వీరమల్లు షూటింగ్ కు బ్రేక్ పడనుంది. అటు పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. వరుసగా రెండు హిట్లు కొట్టిన పవన్ ఇప్పుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారని పవన్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రొడ్యూసర్ గ్లిడ్ నిర్ణయంతో పవన్ అభిమానులు కాస్త నిరాశపడక తప్పడంలేదు. పవన్ సినిమా ప్రేక్షకుల ముందుకు మరింత సమయం పట్టేలా ఉంది. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్ వస్తుందేమో చూడాలి.