Pawan Kalyan: సినిమాల్లోనైనా, రాజకీయాల్లోనైనా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(Pawan Kalyan)కు ఉండే క్రేజ్ వేరు. చాలామంది అన్నట్లు ఆయనకు ఉండేది అభిమానులు కాదు భక్తులు. ఇక సోషల్ మీడియాలో అయితే పవర్‌స్టార్ పేరు హోరెత్తిపోతుంది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టినా, ఒక ట్వీట్ చేసిన క్షణాల్లోనే ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతోంది. హీరోగా ఒక స్టిల్ ఇచ్చినా, జనసేనానిగా ఒక్కమాట మాట్లాడినా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. లైకులు, షేర్ల, కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. అలా పవన్ పేరు ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈసారి ఆయనేమి మాట్లాడలేదు..ఫొటోలు కూడా షేర్ చేయలేదు.. జస్ట్ తన ట్విట్టర్ ప్రొఫైల్ ఫొటోను ఛేంజ్ చేశారు అంతకు ముందు పవన్ గుబురు గడ్డంతో బ్లూ కలర్ టీ షర్ట్ తో ఉన్న ఫొటో ట్విట్ర్ డీపీగా ఉండేది.. ఇప్పుడు దాన్ని మార్చి లేటెస్ట్ పిక్ ను అప్ లోడ్ చేశారు. ఈ కొత్త ఫొటోలో పవన్ లుక్ అదిరిపోయింది. ఇందులో వెనక జనసేన పార్టీ ఉండగా.. పవన్ సీరియస్‌గా చూస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో ట్రెండింగ్‌లో నిలిచింది. పవన్ ఫొటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు పవన్. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు గబ్బర్‌సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో నటించనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..