
ప్రస్తుతం ఇండస్ట్రీలో బ్యాడ్ లక్ బ్యూటీగా మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన ఈ చిన్నది ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో బ్యాడ్ లక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. పూజ హెగ్డే నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నదానికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ అమ్మడిని ఆదుకోలేకపోతున్నాయి. దాంతో ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. ఓ వైపు రష్మిక, కీర్తిసురేష్, త్రిష, నయన్ లాంటి హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే పూజా మాత్రం హిట్స్ లేక సతమతం అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందని తెలుస్తుంది.
పూజా హెగ్డే చివరిగా స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో సినిమాలో కనిపించింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షక్షులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది స్టార్ హీరో ధనుష్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. విగ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ ను తీసుకున్నారని తెలుస్తుంది.
ఆ యంగ్ బ్యూటీ ఎవరో కాదు అందాల భామ మమిత బైజు..ఇప్పుడు ఇదే వార్త కోలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది మమిత. ఇక ఇప్పుడు ఈ చిన్నది సూర్య నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అలాగే దళపతి విజయ్ జననాయగన్ సినిమాలోనూ నటిస్తుంది. ఇక ఇప్పుడు ధనుష్ సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. తాజాగా మమిత తన ఇన్ స్టాలో క్లారిటీ ఇచ్చింది. ధనుష్ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. వరుసగా సూర్య, ధనుష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకుందంటే.. ఈ అమ్మడి లక్ మాములుగా లేదు మరి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.