Pooja Hegde: బుట్టబొమ్మ ఆస్తులు తెలిస్తే అవాక్కవుతారు.. పూజా హెగ్డే లగ్జరీ కార్ల కలెక్షన్స్, కలల భవనం..

|

Oct 01, 2023 | 1:35 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. తెలుగు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కొంతకాలంగా పూజాకు అదృష్టం కలిసి రావడం లేదు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఆమె నటించిన అన్ని చిత్రాలు డిజాస్టర్స్ అవుతున్నాయి. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. కానీ కొన్ని కారణాలతో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ నుంచి ఈ బ్యూటీ తప్పుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Pooja Hegde: బుట్టబొమ్మ ఆస్తులు తెలిస్తే అవాక్కవుతారు.. పూజా హెగ్డే లగ్జరీ కార్ల కలెక్షన్స్, కలల భవనం..
Pooja Hegde
Follow us on

ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ పూజా హెగ్డే. అక్కినేని నాగచైతన్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అతి తక్కువ సమయంలోనే తెలుగులోని స్టార్ హీరోస్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ వరకు దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. తెలుగు, తమిళం, హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే కొంతకాలంగా పూజాకు అదృష్టం కలిసి రావడం లేదు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఆమె నటించిన అన్ని చిత్రాలు డిజాస్టర్స్ అవుతున్నాయి. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. కానీ కొన్ని కారణాలతో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ నుంచి ఈ బ్యూటీ తప్పుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా పూజా హెగ్డే రెమ్యునరేషన్.. ఆస్తులు, లగ్జరీ కార్ల కలెక్షన్స్ ఇలా అన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పూజా హెగ్డే నికర విలువ 51 కోట్ల రూపాయలు. దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించిన పూజా.. పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ఇతర ప్రాజెక్ట్‌ యాడ్స్ చేస్తుంది. ఒక్కో ప్రాజెక్ట్‌కి రూ. 3 నుంచి రూ.4 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. అలాగే ఎండార్స్‌మెంట్‌ల కోసం రూ.40 లక్షలు వసూలు చేస్తుంది. నెలవారీ ఆదాయం రూ.50 లక్షలుగా అంచనా వేయబడింది.

ఇవి కూడా చదవండి

పూజా హెగ్డే లగ్జరీ కార్ల కలెక్షన్ కలిగి ఉంది. ఆమె వద్ద దాదాపు రూ.2 కోట్ల విలువైన పోర్షే కయెన్, రూ. 60 లక్షల విలువైన జాగ్వార్, రూ. 80 లక్షల విలువైన Audi Q-7 కారును కలిగి ఉంది. అలాగే 2021లో పూజా హెగ్డే ముంబైలోని బాంద్రాలో సముద్రానికి ఎదురుగా 3BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ముంబై స్కైలైన్ సుందరమైన వ్యూతో అందమైన ఇల్లుగా మార్చుకుంది. ఇందుకు దాదాపు రూ. 6 కోట్లు ఖర్చు చేసింది. అలాగే హైదరాబాద్‌లో 4 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన ఇల్లు కలిగి ఉంది.

పూజా హెగ్డే చాలా ఖరీదైన బ్యాగ్‌లను కలిగి ఉంది. ఆమె తెలుపు రంగులో రూ.1.91 లక్షల విలువైన లూయిస్ విట్టన్ హ్యాండ్‌బ్యాగ్, రూ.1.4 లక్షల విలువైన LV క్రోయిసెట్ హ్యాండ్‌బ్యాగ్‌ని కలిగి ఉన్నట్లు సమాచారం. ఆమె రూ.1.3 లక్షల విలువైన క్రిస్టియన్ డియర్ హ్యాండ్‌బ్యాగ్‌ని కూడా కలిగి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.