Tollywood: మాల్దీవ్స్‏లో ఎంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టరా ?.. తెలుగమ్మాయే..

తాజాగా ఓ బ్యూటీ లేటేస్ట్ పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. వెండితెరపై అలరించడమే కాదు.. ఓటీటీ వేదికగా పలు యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఈ బ్యూటీ నార్త్ అమ్మాయి కాదు.. అచ్చ తెలుగమ్మాయి.

Tollywood: మాల్దీవ్స్‏లో ఎంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టరా ?.. తెలుగమ్మాయే..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 01, 2023 | 2:01 PM

ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ మరోసారి వైరలవుతుంది. గత కొన్ని రోజులుగా సినీతారల చిన్ననాటి ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ బ్యూటీ లేటేస్ట్ పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. వెండితెరపై అలరించడమే కాదు.. ఓటీటీ వేదికగా పలు యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తూ నటిగా ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఈ బ్యూటీ నార్త్ అమ్మాయి కాదు.. అచ్చ తెలుగమ్మాయి. పక్కా తెలంగాణ పిల్ల.. తనే హీరోయిన్ ఈషా రెబ్బా.

1990 ఏప్రిల్ 19న వరంగల్ లో జన్మించింది. ఎంబీఏ పూర్తిచేసిన ఈషా.. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత అంతక ముందు ఆ తర్వాత సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో తెలుగులో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంది. తెలుగులో అమీ తుమీ, అవే, బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం చిత్రాల్లో నటించింది. ఇటు తెలుగు, తమిళంలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ అటు ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

ఇక ఇటీవల సుధీర్ బాబు సరసన మామ మశ్చీంద్ర సినిమాలో నటించింది. ఈ చిత్రంలో ఇన్ ఫ్లూయెన్సర్ విశాలాక్షి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. నటుడు రచయిత హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 6న ప్రేక్,కుల ముందుకు రాబోతుంది.

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.