RRR-Oscar Award 2023: దేవుడా మాకు ఆస్కార్ రావాలి.. ‘ఆర్ఆర్ఆర్’ కోసం తెలుగు రాష్ట్రాల్లో మొక్కులు..  

ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నాటునాటు పాటకు... గోదావరి గట్టుపై స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఆల్ ది బెస్ట్ త్రిబుల్ ఆర్‌ టీమ్‌ అంటూ... గోదావరి సాక్షిగా, రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర... మెగా, నందమూరి అభిమానులు డ్యాన్సులతో దుమ్మురేపారు.

RRR-Oscar Award 2023: దేవుడా మాకు ఆస్కార్ రావాలి.. ఆర్ఆర్ఆర్ కోసం తెలుగు రాష్ట్రాల్లో మొక్కులు..  
Naatu Naatu Song In Oscar 2023

Updated on: Mar 12, 2023 | 11:01 AM

ప్రపంచ వెండితెరపై తెలుగు వెలుగులు.. జిగేల్‌ మంటున్నాయ్‌. ఎక్కడ చూసినా ఆస్కార్‌ ఆస్కార్‌.. అనే ముచ్చటే వినిపిస్తోంది. ట్రిపుల్‌ ఆర్‌ మూవీ నుంచి నామినేట్‌ అయిన ‘నాటు నాటు’ పాట.. నాన్‌స్టాప్‌గా మార్మోగుతోంది. దానికి సపోర్ట్‌గా తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఫీవర్‌ మొదలైంది. ఆస్కార్‌ అవార్డుకు అడుగు దూరంలో నిలిచిన ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌కి… తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయ్‌. రాజమండ్రిలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ … ఫుల్ జోష్‌లో తమ మద్దతును తెలియజేశారు. ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నాటునాటు పాటకు… గోదావరి గట్టుపై స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఆల్ ది బెస్ట్ త్రిబుల్ ఆర్‌ టీమ్‌ అంటూ… గోదావరి సాక్షిగా, రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర… మెగా, నందమూరి అభిమానులు డ్యాన్సులతో దుమ్మురేపారు.

ట్రిపుల్‌ ఆర్‌ గురించి.. ఆ దేవుడికి కూడా వినతుల హోరు పెరిగిపోయింది. ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నాటు నాటు పాటకు.. అత్యున్నత అవార్డు దక్కాలని కోరుతూ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు అభిమానులు. ఆలయ ఆవరణలో నూటొక్క టెంకాయలు కొట్టి.. స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. అన్ని కేటగిరీల్లోనూ ట్రిపుల్‌ ఆర్‌కు అవార్డులు దక్కాలని కోరుకున్నారు. ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలోని నాటునాటు పాటను రాసిన.. రచయిత చంద్రబోస్‌ స్వగ్రామంలోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఆయన రాసిన పాట.. ఆస్కార్‌ బరిలో ఉండటం పట్ల ఆయన బంధుమిత్రులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

చంద్రబోస్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్‌ తప్పక వచ్చి తీరుతుందనే ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానులను ఆస్కార్‌ ఫీవర్‌ కుదరిపేస్తోంది. ప్రపంచ సినీవేదికపై తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటాలంటూ.. ట్రిపుల్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు అభిమానులు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానులను ఆస్కార్‌ ఫీవర్‌ కుదరిపేస్తోంది. ప్రపంచ సినీవేదికపై తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటాలంటూ.. ట్రిపుల్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు అభిమానులు. ఇక ఆస్కార్ అవార్డ్ ప్రధానోత్స వేడుకలను మన టీవీ9లో మినట్ టూ మినట్ లైవ్ అపేడ్ట్స్ చూడొచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.