Sarkaru Vaari Paata: మహేష్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. సర్కారు వారి పాట టీం స్పెషల్ సర్‏ప్రైజ్..

|

Jun 12, 2022 | 9:41 AM

మే 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మాత్రమే కాకుండా.. పాటలు సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో

Sarkaru Vaari Paata: మహేష్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. సర్కారు వారి పాట టీం స్పెషల్ సర్‏ప్రైజ్..
Sarkaru Vaari Paata
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మే 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మాత్రమే కాకుండా.. పాటలు సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. తమన్ అందించిన సంగీతం సినిమాను మరో లెవల్‏కు తీసుకెళ్లింది..ఇప్పటికే యూట్యూబ్‏లో సర్కారు వారి పాట సినిమా పాటలు శ్రోతులను ముగ్దులను చేస్తున్నాయి. తాజాగా మహేష్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు సర్కారు వారి పాట చిత్రయూనిట్.

ఈ సినిమా నుంచి పెన్నీ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట ప్రమోషన్ వీడియోలో మహేష్ గారాల పట్టి సితార తళుక్కున మెరిసింది. తమన్ స్వరపరిచిన ఈ పాట ట్యూన్ కొత్త.. లిరిక్స్ క్యాచీగా ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. నకాష్ అజీజ్ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన కళావతి, మురారి వా పాటలకు విశేష స్పందన వస్తోంది. ఈ చి్తరాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఈ నెల చివరలో వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా పట్టాలెక్కనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‏టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.