Pekamedalu Movie: సినిమా ప్రమోషన్స్‌కు డబ్బులు లేవు.. ప్లీజ్ సహాయం చేయండి.. పేకమేడలు హీరో..
ముఖ్యంగా ఆర్థిక సమస్యలను అధిగమించి నిలబడాల్సిందే. ఇప్పుడు అదే కష్టం ఓ కుర్రహీరోకు వచ్చింది. ఇన్నాళ్లు సూపర్ హిట్ చిత్రాలలో నెగిటివ్ రోల్స్ చేసి అలరించిన ఆ కుర్రాడు ఇప్పుడు హీరోగా మారేందుకు రెడీ అయ్యారు. కథానాయకుడిగా ఓ సినిమా కూడా రూపొందించారు. కానీ ఆ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రం డబ్బులు లేవని.. ప్రమోషన్స్ కోసం ఎలాగైన సాయం చేయాలంటూ ప్రేక్షకులను అడుగుతున్నాడు. అతడే వినోద్ కిషన్.
సినిమా అనే రంగుల ప్రపంచంలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందం, టాలెంట్ ఉన్న అదృష్టం కలిసిరాని వారి గురించి చెప్పక్కర్లేదు. మరికొందరు వెండితెరపై స్టార్ డమ్ అందుకున్న దానిని నిలబెట్టుకోవడంలో విఫలమవుతుంటారు. ఇప్పుడిప్పుడే కొత్త నటీనటులు వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. ఇక మరికొందరు తమకు వచ్చే అవకాశం ఎదురుచూస్తున్నారు. ఇండస్ట్రీలో గుర్తింపు రావాలంటే ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొవాల్సిందే. ముఖ్యంగా ఆర్థిక సమస్యలను అధిగమించి నిలబడాల్సిందే. ఇప్పుడు అదే కష్టం ఓ కుర్రహీరోకు వచ్చింది. ఇన్నాళ్లు సూపర్ హిట్ చిత్రాలలో నెగిటివ్ రోల్స్ చేసి అలరించిన ఆ కుర్రాడు ఇప్పుడు హీరోగా మారేందుకు రెడీ అయ్యారు. కథానాయకుడిగా ఓ సినిమా కూడా రూపొందించారు. కానీ ఆ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రం డబ్బులు లేవని.. ప్రమోషన్స్ కోసం ఎలాగైన సాయం చేయాలంటూ ప్రేక్షకులను అడుగుతున్నాడు. అతడే వినోద్ కిషన్.
వినోద్ కిషన్.. కార్తి నటించిన నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించారు. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. పేకమేడలు అనే సినిమాలు నటించారు. ఇప్పుడు ఈ మూవీ విడుదలకు సిద్ధమయ్యింది. అయితే ప్రమోషన్స్ చేసేందుకు మాత్రం డబ్బులు లేవని.. సహాయం చేయాలంటూ ప్రేక్షకులను వేడుకున్నాడు. ఇందుకు సంబంధించి యూట్యూబ్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు.
“తెలుగులో తొలిసారిగా హీరోగా పేకమేడలు సినిమాలో నటించాను. లక్ష్మణ్ అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అయితే మూవీ ప్రమోషన్స్ కోసం డబ్బులు కావాలి. మీరు రూ.5, లేదా రూ.10 ఎంతైనా సరే ఈ క్యూఆర్ కోడ్ కు స్కాన్ చేసి పంపించండి. ప్లీజ్ హెల్ప్. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. హిట్ అయ్యాక వచ్చిన లాభాల నుంచి వడ్డీతో కలిపి మీ డబ్బులు ఇచ్చేస్తా” అంటూ వీడియోలో రిక్వెస్ట్ చేశాడు. అయితే ఇదంతా కేవలం ప్రమోషన్లలో భాగమే అంటున్నారు నెటిజన్స్. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఓ వీడియో లింక్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియో ఓపెన్ అవుతుంది. దీంతో ఇదంతా సినిమా ప్రమోషన్లలో భాగమే అని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.