AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీసీ శ్రీరామ్ తప్పుకుంది అందుకేనా..?

భారతదేశంలో  ఉన్న ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో పీసీ శ్రీరామ్ ముందు వరసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లెజెండ్ ప్రస్తుతం తెలుగులో నితిన్ 'రంగ్ దే' సినిమాకు వర్క్ చేస్తున్నారు.

పీసీ శ్రీరామ్ తప్పుకుంది అందుకేనా..?
Ram Naramaneni
|

Updated on: Sep 08, 2020 | 9:56 PM

Share

భారతదేశంలో  ఉన్న ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో పీసీ శ్రీరామ్ ముందు వరసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లెజెండ్ ప్రస్తుతం తెలుగులో నితిన్ ‘రంగ్ దే’ సినిమాకు వర్క్ చేస్తున్నారు. చాలా సెలక్టీవ్ గా సినిమాలకు ఓకే చెప్పే పీసీ శ్రీరామ్ తన తదుపరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా ముంబై నుంచి ప్రొడ్యూసర్స్ వచ్చి సినిమా చేసే విషయమై పీసీ శ్రీరామ్ ను సంప్రదించారట. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ను ప్రధాన పాత్ర కోసం అనుకున్నారు. అయితే పీసీ శ్రీరామ్ మాత్రం ఈ ప్రాజెక్టును రిజక్ట్ చేశారు.

కంగనా ప్రధాన పాత్రలో అనుకుంటున్న సినిమాను తిరస్కరించా. నాకు ఇబ్బందిగా అనిపించింది. నా అభిప్రాయమేంటో ప్రొడ్యూసర్స్ కు అర్థమయ్యేటట్టు చెప్పాను. కొన్ని సార్లు ఏది కరెక్ట్ నిర్ణయమో అదే తీసుకుంటాం. ఆ నిర్మాతలు చేయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని పీసీ శ్రీరామ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కంగనా రనౌత్ ముంబైపై వ్యాఖ్యలు, డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ పరిస్థితులలో ఆమెతో సినిమాతో..షూటింగ్ సెట్ లో ఇబ్బందులు, ఇతర పరిణామాలు ఎదురవతాయని పక్కకు తప్పుకున్నట్లు  బీ టౌన్ టాక్.

Also Read :

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !

Follow Us