జ్యోతిక ‘బంగారు తల్లి’ ట్రైలర్
జ్యోతిక, భాగ్యరాజ్, పార్థీబన్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా 'బంగారు తల్లి'. చిన్నపిల్లల వరుస కిడ్నాప్ ఉదంతాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా రిలీజైన ఈ సినిమా ..

జ్యోతిక, భాగ్యరాజ్, పార్థీబన్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా ‘బంగారు తల్లి’. చిన్నపిల్లల వరుస కిడ్నాప్ ఉదంతాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. 2004వ సంవత్సరం ఊటీలో ఐదుగురు పిల్లలను కిడ్నాప్ ఇతివృత్తాంతాన్ని తెరెకెక్కించడంలో యూనిట్ సక్సెస్ అయిందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. కిడ్నాప్ చేసి హత్య చేయబడిన జ్యోతి అనే చిన్నారి కేసు దర్యాప్తు నేపథ్యంలో సినిమా కొనసాగనుంది. లాయర్ చెప్పే సంభాషణలతో మొదలయ్యే ట్రైలర్ సస్పెన్స్ గా సాగుతోంది. జేజే ఫ్రెడ్రిక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం.