Payal Rajput: ‘జిన్నా’ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం ఆయనే.. అసలు విషయం చెప్పిన పాయల్

తాజాగా హీరో మంచు విష్ణు నటిస్తున్న "జిన్నా" చిత్రంలో హీరోయిన్ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం

Payal Rajput: 'జిన్నా' సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం ఆయనే.. అసలు విషయం చెప్పిన పాయల్
Payal Rajput
Follow us

|

Updated on: Oct 20, 2022 | 12:19 PM

‘ఆర్.ఎక్స్ 100’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది పంజాబీ భామ ‘పాయల్ రాజ్ పుత్’. తొలి సినిమాతోనే ఏ బ్యూటీ సూపర్ హిట్ ను అందుకుంది. ఇటీవల విడుదలైన ‘తీస్ మార్ ఖాన్ ’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది..తాజాగా హీరో మంచు విష్ణు నటిస్తున్న “జిన్నా” చిత్రంలో హీరోయిన్ నటిస్తుంది. అలాగే బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య హెల్మ్ దర్శకుడు. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించిన ఈ చిత్రానికి.. కోన వెంకట్ స్క్రిప్ట్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

అనూప్ రూబెన్స్, నాటు నాటు’ ఫేమ్.. ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ కొరియోగ్రఫీ. రెండు సార్లు జాతీయ అవార్డు గ్రహీత ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ లాంటి బడా సాంకేతిక నిపుణులు, భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న “జిన్నా” సినిమాకు రోజురోజుకు మంచి బజ్‌ని సోంతం చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెలుగు తమిళం, మలయాళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ఈ నెల 21 న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ మీడియాతో ముచ్చటించింది. పాయల్ మాట్లాడుతూ..” నాకు మోహన్ బాబు సార్ గారు ఫోన్ చేసి “అనగనగా ఓ అతిథి” సినిమాలో చాలా మెచ్యూరిటీ గా ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ చేశావు అనడం చాలా గ్రేట్ గా ఫీలయ్యాను. నిజం చెప్పాలంటే ఆ సినిమా నాకు ఒక యాక్ట్రెస్ గా చాలా సంతృప్తి ఇచ్చింది. ఆ తర్వాత రెండు నెలలకు జిన్నా ప్రాజెక్ట్ లో వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఇలా “జిన్నా” లో నటించే అవకాశం రావడానికి ప్రధాన కారణం మోహన్ బాబు గారు అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అలాగే ఈ సినిమాలో నా క్యారెక్టర్ వెరీ యూనిక్ గా విలేజ్ గర్ల్ స్వాతి పాత్రలో పికిల్స్ అమ్మే అమ్మాయి గా నటిస్తున్నాను. ఇది పక్కా పైసా వసూల్ అయ్యే మాస్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ. విష్ణు గురించి మాటల్లో చెప్పలేను. తను చాలా ఎనర్జిటిక్, హంబుల్ పర్సన్. మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో, సన్నీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అలాగే కోన గారితో, చోటా కె. నాయుడు, అనూప్ రూబెన్స్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇలా అందరితో వర్క్ చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది పాయల్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!