Payal Rajput: తన అందంతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన వయ్యారి పాయల్ రాజ్ పుత్. ఈ ముద్దుగుమ్మ అజయ్ భూపతి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బోల్డ్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు పాయల్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డయి. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ కు అదే తరహా క్యారెక్టర్ ఛాన్స్ వచ్చింది. ఆర్డీఎక్స్ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన వెంకీ మామ సినిమాలో నటించింది. ఆతర్వాత నటించినడిస్కో రాజా సినిమాలో చేసింది. పాయల్ చేసిన సినిమాల్లో ఆర్ఎక్స్ 100 సినిమా తప్ప మిగిలిన సినిమాలేవీ ఆశించిన అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దాంతో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ సాంగ్స్ కూడా చేసింది.
అంతే కాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ గా ఆమె పోస్ట్ చేసే స్టిల్స్ కోసం కుర్రాళ్లంతా ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఈ అమ్మడికి సినిమా అవకాశాలు అంతగా లేవు. ఈ నేపథ్యంలోనే తెలుగు ‘బిగ్ బాస్ .. సీజన్ 5’ కోసం పాయల్ ను తీసుకున్నారనే ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్ లో చేయడానికి పాయల్ ఓకే చెప్పేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చింది పాయల్. తాను బిగ్ బాస్ 5లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లలోకి అనవసరంగా తనని లాగొద్దని చెప్పుకొచ్చింది పాయల్.
మరిన్ని ఇక్కడ చదవండి :