Pawan Kalyan: వరుస సినిమాలతో పవన్ జోరు.. మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.

Pawan Kalyan: వరుస సినిమాలతో పవన్ జోరు.. మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్..
Pawan

Edited By: Ravi Kiran

Updated on: Feb 10, 2022 | 3:10 PM

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమా  రీమేక్ జీ ఈ సినిమా రానుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బాధ్యతలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్తమీనన్ నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.  ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. హరిహర వీరమల్లు అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రియాడికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.

ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమా భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్. ఇలా వరుస సినిమాలను లైనప్ చేసిన పవన్ ఇప్పుడు మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తుంది. డైరెక్టర్ రమేష్ వర్మతో సినిమా చేయడానికి పవన్ సిద్ధం అవుతున్నారని ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఖిలాడి సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మాస్ మహారాజా ద్విపాత్రాభినయంతో అలరించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఖిలాడి టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత రమేష్ వర్మ పవన్ కోసం స్క్రిప్ట్ ను సిద్ధం చేయనున్నారని తెలుస్తుంది.  మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bangarraju: ఓటీటీలోకి అడుగుపెట్టనున్న బంగార్రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Aadavallu Meeku Johaarlu: భారీ ధరకు శర్వానంద్ సినిమా థియేట్రికల్ రైట్స్.. కుర్రహీరో కెరీర్‌లోనే అతిపెద్ద డీల్

UnstoppableWith NBK: మెగాస్టార్‌ ఎపిసోడ్‌ ఉండుంటే అన్‌స్టాపబుల్‌ మరో లెవెల్లో ఉండేది.. టాక్‌ షో డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..