
రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఓజీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. ఈ సినిమా తర్వాత పవన్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత పవన్, హరీష్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ పవన్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం విడుదల విషయంలో అనుకున్న దానికంటే కొంత ఆలస్యం జరిగింది.
ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..
తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పవన్ ఖాతాలో హిట్టు కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఈ ట్రైలర్ ఫుల్ ట్రీట్ ఇచ్చేసింది. ఊహించని మాస్ ఎలిమెంట్స్, బీజీఎమ్ తో ట్రైలర్ అదిరిపోయింది. డైలాగ్స్ తో ఈ సినిమా సెన్సేషన్ సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
All set for CULT CELEBRATIONS 💥💥#UstaadBhagatSingh Grand Pre-Release Event tomorrow (March15) from 5 PM onwards at Police Grounds, Hyderabad ❤🔥
Watch Live here!
▶️ https://t.co/mWqChbbalE#UBSTrailer OUT TODAY at 6:30 PM.GRAND RELEASE WORLDWIDE this Ugadi – 19th MARCH,… pic.twitter.com/u9xYdY5g2G
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 14, 2026
ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..
ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‌గా చెప్పేసిన హీరోయిన్..
ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‌లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..