
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ఆయన హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదివరకు ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, గ్లింప్స్, సాంగ్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోతోపాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది ఏపీ సర్కార్.
ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..
తాజాగా 10 రోజుల పాటు ఏపీలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు ఆదేశాలు జారీ చేసింది గవర్నమెంట్. 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో 100 రూపాయలు, మల్టీప్లెక్సులలో 125 రూపాయలు పెంచుకోడానికి వెసలుబాటు కల్పించింది. మార్చి 19 తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వగా..దీని టికెట్ ధరను 500 రూపాయలు (పన్నులతో కలిపి) నిర్ణయించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ మూవీ రన్ టైమ్ దాదాపు 2 గంటల 34 నిమిషాలుగా ఉండనుంది.
ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..
ఇదిలా ఉంటే.. ఇటీవల విడుదలైన ఎత్తరా.. ఎత్తరా కాలరే ఎత్తరా అంటూ సాగే మాస్ సాంగ్ సైతం సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఇందులో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‌గా చెప్పేసిన హీరోయిన్..
ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‌లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..