పవర్ స్టార్ పవర్ ప్యాక్‏బ్లాక్ బస్టర్‏కు 9 ఏళ్ళు.. అప్పటి రికార్డులను తిరగరాసిన గబ్బర్ సింగ్..

Gabbar Singh Movie : గబ్బర్ సింగ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‏లో అత్యధిక రికార్డులు సృష్టించిన సినిమా. ఈ సినిమా కంటే ముందు పవన్ 10 ఏళ్ళ

పవర్ స్టార్ పవర్ ప్యాక్‏బ్లాక్ బస్టర్‏కు 9 ఏళ్ళు.. అప్పటి రికార్డులను తిరగరాసిన గబ్బర్ సింగ్..
Gabbar Singh

Edited By: Team Veegam

Updated on: May 11, 2021 | 3:23 PM

Gabbar Singh Movie : గబ్బర్ సింగ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‏లో అత్యధిక రికార్డులు సృష్టించిన సినిమా. ఈ సినిమా కంటే ముందు పవన్ 10 ఏళ్ళ వరకు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలు లేవు. ఖుషీ సినిమా తర్వాత అంతటి హిట్ సాధించిన సినిమా గబ్బర్ సింగ్. మధ్యలో ‘జల్సా’ వచ్చిన ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా కిక్ ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ అభిమానుల దాహం తీర్చింది. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్.. తెలుగువారి నేటివిటికి తగ్గట్టుగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ రచ్చ చేసేలా చేశాడు డైరెక్టర్.

ముందుగా ఈ సినిమాను ముందుగా నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ లో చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ బ్యానర్ లో చేయడం కుదరలేదు. ఇక ఈ సినిమాను పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. పరమేశ్వర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌లో నిర్మించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం నిర్మాతగా బండ్ల గణేష్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అభిమానులతో కెవ్వు కేక పుట్టించింది. ఈ సినిమాలోని పవన్ డైలాగ్స్ రికార్డ్స్ సృష్టించాయి. ఈ సూపర్ హిట్ సినిమా విడుదలైన నేటికి 9 ఏళ్లు పూర్తవుతుంది. ఇక ఈ సినిమాలో అంత్యాక్షరీ ఎపిసోడ్.. కబడ్డి ఎపిసోడ్ సూపర్ హిట్ గా నిలిచింది.  అయితే ఈ సినిమాలో ముందుగా పవన్ కళ్యాణ్ కంటే ముందుగా రవితేజను అనుకున్నారట్లుగా ఇటీవల నిర్మాత బండ్ల గణేష్ చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read: సుధీర్ బాబు బర్త్ డే… సర్‏ఫ్రైజ్ ఇచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ టీం.. మరోసారి అదరగొట్టిన టాలెంటెడ్ హీరో..

Indian- 2 Movie: ఇండియన్ 2 సినిమాకు తగ్గని సమస్యలు.. పరిష్కార బాటలో కమల్ హాసన్..

Sonu Sood: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు.. రియల్‌ హీరో సోనూసూద్‌ సంచలన నిర్ణయం