AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: జీసస్ క్రైస్ట్ బయోపిక్.. పవన్ కల్యాణ్- సింగీతంల ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్ లో 'ప్రిన్స్ ఆఫ్ పీస్' అట్టహాసంగా ప్రారంభమైంది. జీసస్ క్రైస్ట్ బయోపిక్ గా తెరకెక్కాల్సిన ఈ మూవీ కోసం బెత్లహేం, జెరూసలేం వంటి ప్రదేశాలలో లోకేషన్ల వేట కూడా నిర్వహించారు. కానీ ఏమైందో తెలియదు కానీ ఈ క్రేజీ ప్రాజెక్టు ఆగిపోయింది.

Pawan Kalyan: జీసస్ క్రైస్ట్ బయోపిక్.. పవన్ కల్యాణ్- సింగీతంల ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?
Pawan Kayan
Basha Shek
|

Updated on: Jul 17, 2026 | 6:02 PM

Share

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లో కూడా కొన్ని సినిమాలు అట్టహాసంగా ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయాయి. సత్యగ్రహి, కోబలి, ప్రిన్స్ ఆఫ్ పీస్ వంటి సినిమాలు అనౌన్స్మెంట్ దశలోనే ఆగిపోయి అభిమానులకు నిరాశను మిగిలిపోయాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ సినిమా గురించి. జీసస్ క్రైస్ట్ జీవిత కథ ఆధారంగా లెజెండరీ డైరెక్టర్ సింగీత శ్రీనివాసరావు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. యేసుక్రీస్తు జీవితం, ఆయన చేసిన గొప్ప పనులు, సమాజానికి అందించిన సందేశాలను నేటి తరానికి చెప్పాలని ఒక మంచి కథను సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రముఖ రచయిత జె.కె. భారవి సహాయం కూడా తీసుకున్నారు సింగీతం. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కథానాయకుడిగా తీసుకున్నారు. అయితే ఆయనది జీసస్ పాత్ర కాదని, కానీ కథను మలుపు తిప్పే ఒక పవర్ ఫుల్ రోల్ అని అని దర్శకుడు సింగీతం చెప్పుకొచ్చారు. అలాగే అనుష్కను హీరోయిన్ గా ఎంపిక చేశారు. 2010 లో ‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ పేరుతో ఈ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చారు.

‘ప్రిన్స్ ఆఫ్ పీస్’ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం వంటి భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా రూపొందించానలి మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందుకో సం పవన్ కళ్యాణ్, సింగీతం, నిర్మాత కొండా కృష్ణంరాజులతో కూడిన చిత్ర బృందం ఇజ్రాయెల్, జెరూసలేం, జోర్డాన్, బెత్లహేం వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. జీసస్ క్రైస్ట్ గురించి ఆసక్తికర విషయాలతో పాటు లొకేషన్ల కోసం వేట కూడా నిర్వహించారు. యేసు క్రీస్తు నడయాడిన ఆయా ప్రాంతాలను ప్రత్యక్షంగా చూసి, సినిమాను అత్యంత సహజంగా ఒక విజువల్ వండర్‌గా మార్చాలని భావించారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయి పోయి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందనున్న తరుణంలో ఈ క్రేజీ ప్రాజెక్టుకు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. సెట్స్ పైకి వెళ్లకుండానే అర్ధాంతంగా ఈ సినిమా ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణం బడ్జెట్. మొదట ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఇంటర్నేషనల్ లొకేషన్లు, విజువల్స్, రెమ్యునరేషన్ల కోసం అంచనా వేసిన నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. అంత బడ్జెట్ ను భరించలేమని దర్శక నిర్మాతలు వెనక్కు తగ్గారు. పైగా స్క్రిప్ట్ వర్క్‌ కోసం రెండేళ్లకు పైగా సమయం పట్టడంతో పవన్ కల్యాణ్ కూడా వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. అలా మొత్తానికి భారీ బడ్జెట్ తో అత్యంత భారీగా ప్లాన్ చేసిన జీసస్ క్రైస్ట్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us