AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయశాంతి కర్తవ్యం మూవీ 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో..

విజయశాంతి కెరీర్‌లో కర్తవ్యం ఓ మైలురాయి. ఈ చిత్రం ఆమెకు హీరోలతో సమానమైన క్రేజ్‌, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు తెచ్చిపెట్టింది. కిరణ్ బేడి స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించి, ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. .. ..

విజయశాంతి కర్తవ్యం మూవీ 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో..
Kartavyam 100 Days Function
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2026 | 4:46 PM

Share

విజయశాంతి కెరీర్‌లో కర్తవ్యం చిత్రం ఒక మార్వలెస్ టర్న్ తిప్పిన సెన్సేషనల్ హిట్. అప్పటికే అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న విజయశాంతికి ఈ చిత్రం హీరోలతో సమానమైన క్రేజ్‌ను తీసుకువచ్చింది. అంతేకాకుండా, ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో అవార్డును, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డును సాధించిపెట్టింది. కర్తవ్యంలో పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా ఆమె డాషింగ్ అండ్ డైనమిక్ పాత్రలో నటించి మెప్పించారు. 1990లోనే కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, ముద్దుల మేనల్లుడు చిత్రాల్లో మాస్ పాత్రలు పోషించినప్పటికీ, కర్తవ్యం తర్వాతే విజయశాంతి పవర్ఫుల్ మాస్ పాత్రల వైపు మొగ్గు చూపారు. డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడి స్ఫూర్తితో దర్శకుడు మోహన్ గాంధీ కర్తవ్యం చిత్రాన్ని రూపొందించారు. ఇందులో విజయశాంతి నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా నట విశ్వరూపం చూపించారు. 1990 జూన్ 29న విడుదలైన ఈ చిత్రం అప్పట్లోనే మూడు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ఈ స్థాయిలో విజయాలు సాధించడం ట్రేడ్ పండితులను, చిత్ర ప్రముఖులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు విజయశాంతి కోటి రూపాయల పారితోషికం తీసుకొని రికార్డు నెలకొల్పడం విశేషం.

స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ అంతకుముందు పోలీస్ ఆఫీసర్ కథలు కొన్ని రాసినప్పటికీ, కర్తవ్యం చిత్రం వాటిని మించి విజయం సాధించింది. కిరణ్ బేడి ఎదుర్కొన్న అడ్డంకులు, సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని పరుచూరి సోదరులు ఈ కథను తయారు చేశారు. విజయశాంతి అత్యద్భుతంగా నటించి కిరణ్ బేడిని ప్రేక్షకుల కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు. సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు మోహన్ గాంధీ అద్భుతమైన దర్శకత్వం వహించారు. వినోద్ కుమార్ హీరోగా నటించగా, జలగం ముద్దు కృష్ణయ్యగా ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య నటించారు. విజయశాంతి తండ్రిగా పరుచూరి వెంకటేశ్వరరావు, అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా చరణ్ రాజ్, లాయర్‌గా నర్రా వెంకటేశ్వరరావు, పోలీస్ ఆఫీసర్‌గా నూతన ప్రసాద్ నటించారు. బామ్మ మాట బంగారు బాట చిత్రం షూటింగ్‌లో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీకి అంకితమైన విలక్షణ నటుడు నూతన ప్రసాద్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా విజయం సాధించడంతో ఆయనకు మరో ఐదు చిత్రాల్లో నటించే అవకాశం రావడం గమనార్హం. యువనటి మీనా ఈ సినిమాలో అత్యాచారానికి గురైన యువతిగా ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు.

నగరంలో అన్యాయాలు, అక్రమాలు చేసే ముద్దు కృష్ణయ్యకు, పోలీస్ ఆఫీసర్ వైజయంతికి మధ్య జరిగిన సంఘర్షణే కర్తవ్యం చిత్ర కథాంశం. కర్తవ్యం సినిమా కొనడానికి మొదట్లో బయ్యర్లు అంతగా ఆసక్తి చూపించలేదు. నిర్మాత రత్నం డెఫిసిట్‌తో చిత్రాన్ని విడుదల చేశారు. అయితే, తొలి ఆటకు చిత్రం హిట్ టాక్ తెచ్చుకొని, అద్భుత విజయం సాధించింది. ఈ ఘన విజయాన్ని అక్టోబర్ 7న మద్రాసులోని విజయ శేషమహల్ ఆడిటోరియంలో చిత్ర బృందం ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పుడు మిజోరాం రాష్ట్రంలో డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ బేడి, పోలీస్ అధికారి వ్యాస్ భార్య అరుణ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. బాలకృష్ణ, విజయశాంతి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకకు ప్రత్యేక శోభను తెచ్చారు.

Follow Us
బిల్లు చట్టంగా మారే ముందు 3 సార్లు ఎందుకు చదువుతారు?
బిల్లు చట్టంగా మారే ముందు 3 సార్లు ఎందుకు చదువుతారు?
అప్పులు తీర్చేందుకు తండ్రికే కిడ్నాప్ డ్రామా..!
అప్పులు తీర్చేందుకు తండ్రికే కిడ్నాప్ డ్రామా..!
ఒత్తైన, పొడవైన జుట్టు కోసం బియ్యం నీళ్ళు + మెంతుల కాంబినేషన్!
ఒత్తైన, పొడవైన జుట్టు కోసం బియ్యం నీళ్ళు + మెంతుల కాంబినేషన్!
ఏడాదికిపైగా డ్యూటీకి డుమ్మా.. 70 మంది వైద్యులపై వేటు
ఏడాదికిపైగా డ్యూటీకి డుమ్మా.. 70 మంది వైద్యులపై వేటు
త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..
త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా..
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
రీచార్జ్ ప్లాన్ల కోసం ఇక వెతకాల్సిన పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
భారత్-పాకిస్థాన్ ఫైనల్‌కు దూరంగా మొహ్సిన్ నఖ్వీ.. కారణం ఇదే.!
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
గాజులా మెరిసే చర్మం కావాలా?రోజూ తాగాల్సిన పవర్‌ఫుల్ డ్రింక్స్ ఇవే
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
ఆకాశాన్ని తాకే బ్రిడ్జ్‌పై వందే భారత్ పరుగులు..!
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..
అష్టమి శ్రాద్ధం: పితృదేవతల అనుగ్రహం కోసం ఈ పనులు చేయండి..