AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో ఊహించని మలుపు.. ఉపఎన్నికల షెడ్యూల్ రిలీజ్!

టాలీవుడ్ స్క్రీన్‌పై అదిరిపోయే స్టెప్పులతో థియేటర్లను ఊపేసే డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఇప్పుడు రియల్ వార్ నడుస్తుంది. పైకి ఇది కేవలం డ్యాన్సర్స్ అసోసియేషన్ అంతర్గత గొడవలా కనిపిస్తున్నా.. దీని వెనుక టాలీవుడ్‌ను షేక్ చేసే పెద్ద స్కెచ్చే దాగుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్నటిదాకా ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్ల మధ్య సాగిన ఇగో క్లాష్.. ఇప్పుడు ఏకంగా ఫెడరేషన్ vs డ్యాన్సర్స్ అసోసియేషన్గా మారిపోయింది.

Tollywood: టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో ఊహించని మలుపు.. ఉపఎన్నికల షెడ్యూల్ రిలీజ్!
Tollywood Dancers Association Controversy
Krishna S
|

Updated on: Jul 17, 2026 | 5:42 PM

Share

టాలీవుడ్‌ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో రాజుకున్న వివాదం ఇప్పుడు కాక రేపుతుంది. పైకి ఇది కేవలం డ్యాన్సర్స్ మధ్య జరుగుతున్న అంతర్గత గొడవలా కనిపిస్తున్నా, దీని వెనుక టాలీవుడ్‌లోని ఇద్దరు స్టార్ కొరియోగ్రాఫర్ల ఆధిపత్య పోరు ఉందనే టాక్ వినిపిస్తోంది. నిన్నటిదాకా ఇద్దరు టాప్ మాస్టర్ల మధ్య సాగిన ఇగో క్లాష్.. ఇప్పుడు ఏకంగా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ Vs డ్యాన్సర్స్ అసోసియేషన్‌గా మారిపోయింది. ఫెడరేషన్ జోక్యంతో వివాదం సద్దుమణుగుతుందని భావిస్తే.. అసలు ఆ జోక్యాన్నే సవాల్ చేస్తూ అసోసియేషన్ తిరుగుబాటు జెండా ఎగరేయడం ఫిలింనగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సుమలత అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో రెమ్యునరేషన్ స్కామ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో జనరల్ సెక్రటరీ, ట్రెజరర్‌ను ప్రెసిడెంట్ సుమలత సస్పెండ్ చేశారు. సుమలత తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో 8 మంది ఈసీ సభ్యులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దీంతో అసోసియేషన్‌లో ఒక్కసారిగా 10 సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఉప ఎన్నికలా? పూర్తి స్థాయి ఎన్నికలా?

ఇక్కడే అసలు పీటముడి పడింది. ఖాళీ అయిన ఆ 10 స్థానాల భర్తీ కోసం మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత పట్టుబడుతున్నారు. అయితే అందుకు శేఖర్ మాస్టర్ వర్గం అస్సలు ఒప్పుకోవడం లేదు. అసోసియేషన్‌ను పూర్తిగా రద్దు చేసి మొదటి నుంచి పూర్తి స్థాయి ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సీన్ లోకి ఫెడరేషన్.. సుమలత వర్గం తీవ్ర ఆగ్రహం..

ఈ పంచాయితీ కాస్తా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ముంగిటకు చేరింది. రంగంలోకి దిగిన ఫెడరేషన్.. సుమలతతో పాటు సస్పెండ్ అయిన సభ్యులతో కీలక సమావేశం నిర్వహించింది. అయితే ఈ మీటింగ్‌లో ఫెడరేషన్ కేవలం ఏకపక్షంగా వ్యవహరించిందని, శేఖర్ మాస్టర్ వర్గం వాదనలకే ప్రాధాన్యత ఇచ్చి తమ వైపు న్యాయాన్ని వినలేదని సుమలత టీమ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫెడరేషన్ వైఖరిపై తిరుగుబాటు ప్రకటిస్తూ డ్యాన్సర్స్ అసోసియేషన్ తాజాగా ఒక ఘాటు లేఖను విడుదల చేసింది. ‘‘ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఫెడరేషన్‌కు లేదు. ఫెడరేషన్‌కు రెస్పెక్ట్ ఇస్తాం కానీ మా అసోసియేషన్ బైలాస్ ప్రకారమే నడుచుకుంటాం. ఇతరుల జోక్యాన్ని సహించం. తప్పు చేసిన వాళ్లతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు’’ అని లేఖలో స్పష్టం చేశారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరిగిన రహస్య ఓటింగ్‌లో 75 మంది సభ్యులు ఉప ఎన్నికలకే జై కొట్టారని, ప్రజాస్వామ్యబద్ధంగా సభ్యులు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని సుమలత వర్గం తేల్చి చెప్పింది.

ట్విస్ట్ ఇచ్చిన ఉప ఎన్నికల నోటిఫికేషన్..

రాబోయే ఆదివారం అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుందామని గురువారం నాటి సమావేశంలో నిర్ణయించారు. కానీ ఫెడరేషన్‌కు ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అధ్యక్షురాలు సుమలత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరేషన్ మీటింగ్‌ కంటే ముందే ఎన్నికల అధికారి సామ్రాట్ అశోక్ పేరుతో బై ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసి షాక్ ఇచ్చారు.

ఉప ఎన్నికల షెడ్యూల్

  • జూలై 20: నామినేషన్ల స్వీకరణ
  • జూలై 22: నామినేషన్ల ఉపసంహరణ
  • జూలై 26: పోలింగ్, ఫలితాల వెల్లడి

అందరి కళ్లూ ఆదివారం మీటింగ్ పైనే..

ఒకవైపు సుమలత వర్గం ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసి దూకుడు ప్రదర్శిస్తుంటే.. మరోవైపు మొత్తం కార్యవర్గానికి ఎన్నికలు జరపాలని వ్యతిరేక వర్గం పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగాల్సిన జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. ఒకవేళ మీటింగ్ జరిగితే, దానికి ఎంతమంది సభ్యులు హాజరవుతారు? ఫెడరేషన్ ఈ తిరుగుబాటుపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఈ డ్యాన్స్ మాస్టర్ల వివాదం ఇంకెన్ని మలుపులు తిరగనుంది? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఉత్కంఠ రేపుతుంది.

Follow Us