Pawan Kalyan : “500 ఏళ్ల కల సాకారం కానుంది”.. అయోధ్యకు చేరుకున్న పవన్ కళ్యాణ్

మరికొద్ది గంటల్లో జరగనున్న అపూర్వఘట్టం కోసం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎదురుచూస్తున్నారు. రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రజినీకాంత్‌, పవన్‌కళ్యాణ్ హాజరుకానున్నారు. అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రముఖులకు ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్  ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఆ హనుమంతుడే నాకు ఆహ్వానం పంపినట్లుందని అన్నారు చిరంజీవి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అయోధ్యకు హాజరయ్యారు.

Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2024 | 11:39 AM

మరికొద్ది సేపట్లో అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుంది. అయోధ్య చేరుకుంటున్న ప్రముఖులు. మరికొద్ది గంటల్లో జరగనున్న అపూర్వఘట్టం కోసం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎదురుచూస్తున్నారు. రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రజినీకాంత్‌, పవన్‌కళ్యాణ్ హాజరుకానున్నారు. అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రముఖులకు ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్  ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఆ హనుమంతుడే నాకు ఆహ్వానం పంపినట్లుందని అన్నారు చిరంజీవి.తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాల రామయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యారు. అయోధ్యకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు పవన్‌. 500 ఏళ్ల కల సాకారం కాబోతుందని అన్నారు పవన్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి