బాలయ్య మిస్..పవన్ కన్విన్స్..రీమేక్ మూవీతో సేనాని రీ ఎంట్రీ?

బాలయ్య మిస్..పవన్ కన్విన్స్..రీమేక్ మూవీతో సేనాని రీ ఎంట్రీ?

పవన్ కళ్యాణ్..ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్‌ని ఎస్టిమేట్ చెయ్యడం కష్టం. పవన్‌కి ఫ్యాన్స్ కంటే భక్తులు ఎక్కువ ఉంటారు. కానీ పవర్ స్టార్ కాస్తా జనసేనానిగా మారి..పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఢీలాపడ్డారు. పవన్ డ్యాన్స్, డైలాగ్స్, మేనరిజమ్స్ మిస్ అవుతున్నామని తెగ ఫీల్ అవుతున్నారు. అన్నయ్య చిరంజీవిలా అన్యాయం చేసి మూవీస్‌కి దూరమవ్వొద్దని వేడుకుంటున్నారు. మరి పవన్‌కు తన డివోటీస్ ప్రార్థనలు రీచయ్యయో ఏమో తెలియదు కానీ..అతడు త్వరలోనే సిల్వర్ స్రీన్‌పై […]

Ram Naramaneni

|

Oct 16, 2019 | 4:07 AM

పవన్ కళ్యాణ్..ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్‌ని ఎస్టిమేట్ చెయ్యడం కష్టం. పవన్‌కి ఫ్యాన్స్ కంటే భక్తులు ఎక్కువ ఉంటారు. కానీ పవర్ స్టార్ కాస్తా జనసేనానిగా మారి..పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఢీలాపడ్డారు. పవన్ డ్యాన్స్, డైలాగ్స్, మేనరిజమ్స్ మిస్ అవుతున్నామని తెగ ఫీల్ అవుతున్నారు. అన్నయ్య చిరంజీవిలా అన్యాయం చేసి మూవీస్‌కి దూరమవ్వొద్దని వేడుకుంటున్నారు.

మరి పవన్‌కు తన డివోటీస్ ప్రార్థనలు రీచయ్యయో ఏమో తెలియదు కానీ..అతడు త్వరలోనే సిల్వర్ స్రీన్‌పై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. గతంలో పవన్ మాత్రం తాను రాజకీయాలకు అంకితమని.. ఇకపై సినిమాలు చేయనని తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఆత్మీయులు ఇచ్చిన సలహాల మేరకు సేనాని మనసు మార్చుకున్నారన్న టాక్ ఇండష్ట్రీలో నడుస్తోంది. ముహుర్తానికి పొంగల్ టైం సెట్ చేసినట్టు వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ పవన్ ఏ సినిమా చేయబోతున్నాడో తెలిస్తే మాత్రం మీరు పక్కా షాక్ అవుతారు.

హిందీలో బ్లాక్ బస్టర్ అయిన ‘పింక్’ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు దీనిపై కావాల్సినంత కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక ఈ మూవీని గబ్బర్ సింగ్‌తో పవన్‌కు లైఫ్ టైం హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. మొదట ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేస్తాడని వార్తలు చాలా రోజులు హల్‌చల్ చేశాయి. కానీ నటసింహాం ఎందుకో ఆ రోల్ వైపు మొగ్గుచూపలేదు.

తమిళనాట అజిత్ హీరోగా నేర్కొండ పార్వైగా రీమేక్ చేసారు ఈ చిత్రాన్ని. అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారనే సమాచారం వినిసిస్తోంది. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా హరీష్ శంకర్ ఈ కథను మార్చేస్తున్నట్లు టాక్. ఇదే కనుక నిజమైతే మరికొద్దిరోజుల్లోనే మెగా ఫ్యాన్స్ కంటే ఆనందపడేవాళ్లు ఇంకెవరుంటారు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu