
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇటీవలే హరిహరవీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. తాజాగా విశాఖపట్నంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మరోసారి నిర్వహించారు. ఏపీ అభిమానుల కోసం పవన్ నటించిన హరిహరవీరమల్లు మూవీ ఈవెంట్ ను వైజాగ్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధత్యలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ వేగంగా జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు రాబోతుంది. జూలై 24న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి