500 ఏళ్ల కల సాకారం చేస్తూ అయోధ్యలో రాముడు కొలువు దీరాడు. కొత్తగా నిర్మించిన ఆలయంలో సోమవారం (జనవరి 22) బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహా క్రతువు పూర్తయ్యింది. అనంతరం శ్రీరామ మందిరంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు కూడా ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమయ్యారు. ఇక జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయోధ్య రామోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం ముందు తీసుకున్న సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్. ‘రామ కార్యంఅంటే రాజ్యకార్యం.. ప్రజాకార్యం.. జైశ్రీరామ్’ అని తన దైన శైలిలో క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ సెల్ఫీ నెట్టింట తెగ వైరలవుతోంది. అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, నెటిజన్లు జై శ్రీరామ్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
అంతకుముందు బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్తున్నా.. అంటూ దారిలో తీసిన వీడియోను పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అది కూడా నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. అయోధ్యకు రావడం చాలా ఆనందంగా ఉందని, 500 ఏళ్ల కల సాకారం కాబోతుందని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు పవన్. ఇక చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్‌లు కూడా అయోధ్య రామోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైందీ మెగా ఫ్యామిలీ.
అయోధ్య రామాలయం, ప్రతి భారతీయుడి కల – జనసేనాని#AyodhyaRamMandir #PawanKalyan #UANow pic.twitter.com/H9h72xiDmi
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) January 21, 2024
#WATCH | Ayodhya, Uttar Pradesh | Jana Sena chief Pawan Kalyan says, “Today has been quite emotional for me. At the time of Pranpratishtha, tears had started rolling down my eyes…This has strengthened and unified Bharat as a nation…” pic.twitter.com/pQlXjlz5hA
— ANI (@ANI) January 22, 2024
రామకార్యం అంటే రాజ్య కార్యం
ప్రజా కార్యం…🙏 జై శ్రీ రామ్ pic.twitter.com/qkDGgRMWtZ— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2024
जय श्री राम ! 🙏
On the way to Ayodhya…
To witness ‘ Lord Rama’s Pran Prathishta..’
Lord Rama is the ‘Hero of our Bharat Civilisation.’And it took five centuries of struggle to bring back Lord Rama into ‘Ayodhya.’धर्मो रक्षति रक्षितः
ధర్మో రక్షతి రక్షితః.జై శ్రీ రామ్ !… pic.twitter.com/Sh0SP2a5qG
— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి