Unstoppable 2: క్రేజ్‌కా బాప్‌ అనేది అందుకే మరి.. టీవీలో పవన్‌ కల్యాణ్‌కు హారతి పట్టిన మహిళ

|

Feb 04, 2023 | 3:33 PM

ఈ ఎపిసోడ్‌ను చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వీటన్నింటినీ ఆహా రీట్వీట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Unstoppable 2: క్రేజ్‌కా బాప్‌ అనేది అందుకే మరి.. టీవీలో పవన్‌ కల్యాణ్‌కు హారతి పట్టిన మహిళ
Pawan Kalyan In Unstoppable
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు ఉండే క్రేజ్‌ వేరు. ఆయన సినిమా వ‌స్తుందంటే చాలు బాక్సాపీస్ వ‌ద్ద హంగామా మాములుగా ఉండదు. థియేటర్ల వద్ద కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లు, పాలాభిషేకాలు.. ఇలా ఫ్యాన్స్‌ రచ్చ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తారు. ఇప్పుడు కూడా అలాంటి సందడే నెలకొంది. అలాగనీ పవర్‌ స్టార్ సినిమా ఏదీ ఇప్పుడు విడుదల కాలేదు. నట సింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అన్‌ స్టాపబబుల్‌ షోకు పవర్‌స్టార్‌ అతిథిగా వచ్చారు. వీరిద్దరి మాటల ముచ్చటకు సంబంధించిన ఇంటర్వ్యూ మొత్తం రెండి ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. ఇందులో భాగంగా గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి నుంచి ఫస్ట్‌ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని చెప్పినట్లుగానే బాలయ్య- పవన్‌ టాక్‌షోకూ ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. ఆహాలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసిన మొదటి ఎపిసోడ్ గా నిలిచి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇక ఈ ఎపిసోడ్‌ను చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వీటన్నింటినీ ఆహా రీట్వీట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఒక మహిళ టీవీలో పవన్‌ రాగానే హారతినిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఆహా రీ ట్వీట్‌ చేస్తూ ఎసిపోడ్‌ను ఆదరిస్తున్నవారందరికీ ధన్యవాదాలు తెలిపింది.

కాగా బాలయ్య- పవన్‌ ముచ్చట్లకు సంబంధించిన రెండో ఎపిసోడ్‌ ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆదివారం (ఫిబ్రవరి5) విడుదల చేయనున్నట్లు ఆహా మేకర్స్‌ తెలిపింది. ‘బాప్‌ ఆఫ్‌ ఆల్‌ ఎపిసోడ్స్‌ పార్ట్‌ 1 కి పగిలిపోయే రికార్డ్స్‌ జాతర జరిగింది. భీమ్లా నాయక్‌ పవర్‌ సాక్షిగా, బద్రీనాథ్‌ పొగరు సాక్షిగా చెబుతున్నాం.. పార్ట్‌ 2 తో సెన్సేషన్‌ డెఫినేషన్‌ మార్చడానికి మేము రెడీ. మీరు రెడీనా?’ అంటూ ట్వీట్‌ చేసింది ఆహా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..