Bheemla Nayak: బాలీవుడ్ బాట పట్టిన భీమ్లానాయక్.. హీరోలుగా ఎవరు నటిస్తున్నారంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భీమ్లానాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ - బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Bheemla Nayak: బాలీవుడ్ బాట పట్టిన భీమ్లానాయక్.. హీరోలుగా ఎవరు నటిస్తున్నారంటే
Bheemla Nayak
Follow us

|

Updated on: Jun 25, 2022 | 8:26 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భీమ్లానాయక్(Bheemla Nayak). మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ – బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక తెలుగులో సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మరో హీరోగా దగ్గుబాటి యంగ్ హీరో రానా కూడా నటించాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా త్రివిక్రమ్ ఆ కథలో చాలా మార్పులు చేశారు. ఇక ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టిందని తెలుస్తోంది. భీమ్లానాయక్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట పలువురు దర్శకనిర్మాతలు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా రీమేక్ లో ఓ స్టార్ హీరో నటించనున్నాడట.

బీ టౌన్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కండల వీరుడు జాన్ అబ్రహం హీరోగా నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులు జాన్ అబ్రహం తీసుకున్నాడు. ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలను  అనురాగ్ కశ్యప్ కి అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇక జాన్ తో తలపడే మరో హీరోపాత్ర  ఎవరు చేయనున్నారనేది త్వరలోనే తెలియనుంది. అయితే రితేష్ దేశముఖ్ ఈ పాత్రలో నటించనున్నారని టాక్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.