Pawan Kalyan-Ram Charan: బాబాయ్ అబ్బాయ్ కాదు అన్నదమ్ముళ్లలా ఉన్నారు.. చరణ్, పవన్ రేర్ ఫోటో చూశారా ?..

ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్ కు సంబంధించిన పిక్స్ వైరల్ కాగా.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు సంబంధించిన పాత ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Pawan Kalyan-Ram Charan: బాబాయ్ అబ్బాయ్ కాదు అన్నదమ్ముళ్లలా ఉన్నారు.. చరణ్, పవన్ రేర్ ఫోటో చూశారా ?..
Ram Charan

Updated on: May 31, 2023 | 3:10 PM

సోషల్ మీడియా.. సెలబ్రెటీలకు.. అభిమానులకు మధ్య వారధి. ఇప్పుడు తమ ఫేవరెట్ హీరోహీరోయిన్లతో నెట్టింట నేరుగా ముచ్చటపెట్టేస్తున్నారు. ఇక అప్ కమింగ్ మూవీస్ గురించి ఆరా తీయడం.. అప్డేట్స్ కావాలంటూ గోల చేయడం తెలిసిందే. ఇక స్టార్స్ పుట్టిన రోజు వస్తే వారికి సంబంధించిన రేర్ ఫోటోస్ షేర్ చేస్తూ విషెస్ తెలుపుతుంటారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సినీ తారల అరుదైన పిక్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్ కు సంబంధించిన పిక్స్ వైరల్ కాగా.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు సంబంధించిన పాత ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ ఫోటో చూస్తుంటే చరణ్ ఇంకా అప్పటికీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదని తెలుస్తోంది. ఇక పవన్ మాత్రం చాలా స్టైలీష్ అండ్ కూల్ సింపుల్ గా కనిపిస్తున్నారు. జానీ సినిమాలో ఉన్న లుక్ లో పవన్ కనిపిస్తుండడంతో.. ఆ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫోటో కావచ్చు అంటున్నారు అభిమానులు. దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం లేదు. కానీ ఆ ఫోటోలో పవన్, రామ్ చరణ్ ఇద్దరూ బాబాయ్, అబ్బాయిలా కాకుండా బ్రదర్స్ లా ఉన్నారు. వీరిద్దరిని అలా చూడడం చాలా బాగుందని మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan, Ram Charan

ఇదిలా ఉంటే… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలలో నటిస్తున్నారు. ఇక మరోవైపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బ్రో మూవీ అడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. ఇక రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సతీమణి ఉపాసన నిండు గర్భిణీ కావడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడుపుతున్నారు చెర్రీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.