Paruchuri Gopala Krishna: మహేష్ వయసే కాదు మనసు కూడా పెరగలేదు: పరుచూరి

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్రేజ్, ఆయన స్టార్ డమ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే...

Paruchuri Gopala Krishna: మహేష్ వయసే కాదు మనసు కూడా పెరగలేదు: పరుచూరి
Mahesh

Edited By:

Updated on: Aug 27, 2021 | 9:34 AM

Paruchuri Gopala Krishna: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్రేజ్, ఆయన స్టార్ డమ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో నెంబర్ వన్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. మహేష్ సినిమాలతోనే కాదు. అందంలోనూ నెంబర్ వన్. తాజాగా మహేష్ గురించి లెజెండ్రీ రైటర్ పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ..మహేష్ వయసే కాదు.. మనసు శరీరం కూడా పెరగలేదు అన్నారు. పరుచూరి గోపాల కృష్ణ  తాను సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి వివరిస్తూ ఉంటారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా వీడియో చేయాలనుకున్నారట.. కానీ అనుకోకుండా ఆలస్యం అయ్యిందని చెప్పారు. మహేష్ చిన్నప్పటి నుండే మంచి నటుడు.

మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొడుకు దిద్దిన కాపురం సినిమాలో కృష్ణ మరియు విజయశాంతిలతో కలిసి నటించాడు. ఆ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేశాడు. ఆ రోజుల్లో సూపర్ స్టార్‌గా కృష్ణ.. లేడీ అమితాబ్ అంటూ విజయశాంతి స్టార్స్‌గా రాణిస్తున్నారు. అలాంటి సమయంలో వారిద్దరు కలిసి నటించిన సినిమాలో మహేష్ నటించి తన మార్క్‌ను చూపించాడు. నిజానికి కృష్ణ- విజయశాంతిలతో పోటీపడి మరి నటించాడు అన్నారు. కృష్ణ గారు నమ్మకంతో మహేష్ బాబు బాధ్యత మాకు అప్పగించిన సమయంలో రాజకుమారుడు సినిమా కథను తయారు చేశాం. ఆ సినిమాకు మహేష్ పూర్తి న్యాయం చేసి నటించాడు. ఆతర్వాత ఒక్కడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అర్జున్ సినిమా గురించి మాట్లాడుతూ..బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల ప్లాప్ అయ్యింది అన్నారు. సెట్టింగ్‌ను వేయకుండా నేరుగా అక్కడే సినిమా తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేది అంటూ పరుచూరి అభిప్రాయపడ్డారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: ఓటీటీలోకి మక్కల్ సెల్వన్ సినిమా.. ఆకట్టుకుంటున్న అనబెల్ సేతుపతి ఫస్ట్‏లుక్ పోస్టర్..

Prabhas: శ్రీదేవి సోడా సెంటర్ పై ప్రభాస్ ఇంట్రెస్ట్.. చిత్రయూనిట్‏తో డార్లింగ్ ముచ్చట్లు..

మోడల్ ప్రాణం మీదికి వచ్చిన ఫోటోషూట్.. ఫోటోల కోసం వెళితే కోసం వెళితే చిరుతల దాడి..