
పొట్ట కూటి కోసం పాటలు పాడుకుంటూ ఊరూరా తిరిగారాయన. తనకు మాత్రమే సాధ్యమైన కిన్నెర వాయిద్యంతో సంగీత ప్రియులను అలరించారు. తన పాటలను మెచ్చిన సినీ పరిశ్రమ సైతం తనను అక్కున చేర్చుకుంది. పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలోనూ తన పాట వినిపించింది. మెప్పించింది. తన గాన ప్రతిభకు గుర్తింపుగా ప్రశంసలు, పురస్కారాలు కూడా వచ్చాయి. మరీ ముఖ్యంగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే పద్మశ్రీ అవార్డును ఇచ్చి ఆయనను సత్కరించింది. దీంతో తన కష్టాలు ఇక మాయమైపోయినట్టేననుకున్నారు. కానీ ఆ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ కనీసం తన పొట్ట కూడా నింపలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో పూట గడవడం కోసం రోజువారీ కూలీగా మారాల్చి వచ్చింది. అవును పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య రోజువారి కూలీగా మారారు. హైదరాబాద్ సమీపంలోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందుకే పొట్టకూటి కోసం ఇలా కూలీపనులకు వెళ్తున్నట్లు ఆయన దీనంగా చెప్పుకొచ్చారు.
‘గతంలో కేసీఆర్ ప్రభుత్వం నాకు కోటి రూపాయల గ్రాంట్ ను అందించింది. అయితే అవి నా పిల్లల పెళ్లిళ్లతో పాటు స్థలం కొనుక్కోవడానికి సరిపోయాయి. డబ్బులు సరిపోకపోవడంతో కడుతున్న ఇంటిని కూడా మధ్యలో నిలిపివేశాను. నా కుమారులకు ఆరోగ్యం సరిగా లేదు. ముందుల కోసమే నెలకు రూ. ఏడు వేలు ఖర్చు అవుతోంది. గత 2,3 నెలలుగా పెన్షన్ కూడా సరిగా రావడం లేదు. ఇంట్లో పూటగడవటం కోసం పని కోసం చాలా చోట్లు ప్రయత్నించాను. అయితే చాలామంది తనపై సానుభూతి చూపిస్తున్నారు కానీ పని ఇవ్వడం లేదు. అందుకే ఇలా కూలీగా మారను’ అని చెప్పుకొచ్చారు మొగిలయ్య.
Heart Breaking: Padma Shri Awardee Mogulaiah Now a Daily Wager.
He says his monthly honorarium stopped, and although all respond positively, they do nothing.
Mogulaiah was seen working at a construction site in Turkayamanjal near Hyderabad.
Darshanam Mogulaiah was honoured… pic.twitter.com/Zru4If7h0x
— Sudhakar Udumula (@sudhakarudumula) May 3, 2024
మొగులయ్య దీన పరిస్థితిపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. తన కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Thanks Sucheta Ji for bringing this news to my attention
I will personally take care of Sri Moguliah’s family. My team @KTRoffice will reach out to him immediately https://t.co/xV4NjXtik6
— KTR (@KTRBRS) May 3, 2024
ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులను ఎప్పుడూ గౌరవిస్తుందని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా గుస్సాడి కనకరాజు, దర్శన్ మొగిలయ్య తదితరులకు క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లించినట్లు ఆధారాలను పోస్టు చేసింది.
The pension is being regularly paid to Darshanam Mogulaiah. 👉 Telangana Government paid a pension of ₹10,000 on March 31, 2024.
తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులను ఎప్పుడూ గౌరవిస్తుంది. వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించి అత్యున్నతంగా గౌరవిస్తుంది.
👉 గుస్సాడి కనకరాజు,… pic.twitter.com/67d8JB6XHV— Congress for Telangana (@Congress4TS) May 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.