Maama Mascheendra: అప్పుడే ఓటీటీలోకి సుదీర్ బాబు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..

నటుడు హర్షవర్ధన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన మామా మశ్చీంద్ర సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం లావుగా మరో పాత్ర కోసం స్లిమ్ గా ఇంకొక పాత్ర కోసం వయసు మళ్ళిన వ్యక్తిగా కనిపించాడు. ఇక ఈ సినిమా ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించింది.

Maama Mascheendra: అప్పుడే ఓటీటీలోకి సుదీర్ బాబు సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడంటే..
Mama Mascheendra
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2023 | 6:20 PM

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మామా మశ్చీంద్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నటుడు హర్షవర్ధన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన మామా మశ్చీంద్ర సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం లావుగా మరో పాత్ర కోసం స్లిమ్ గా ఇంకొక పాత్ర కోసం వయసు మళ్ళిన వ్యక్తిగా కనిపించాడు. ఇక ఈ సినిమా ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. చాలా సినిమా ఇప్పటికే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు తక్కువ రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు వారం రోజులకే ఓటీటీలోకి వస్తున్నాయి. ఇప్పుడు మామా మశ్చీంద్ర సినిమా కూడా ఓటీటీలోకి రానుంది.

మామా మశ్చీంద్ర సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మామా మశ్చీంద్ర సినిమాను త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. దసరా సందర్భంగా మామా మశ్చీంద్ర సినిమాను అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తోంది. అక్టోబర్ 20న మామా మశ్చీంద్ర మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దసరా పురస్కరించుకొని థియేటర్స్ లో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. దళపతి విజయ్ లియో, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, బాలకృష్ణ భగవత్ కేసరి సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు మామా మశ్చీంద్ర సినిమా ఓటీటీలోకి రానుంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.