Puri Jagannadh: ఉగాది వేళ తన తదుపరి సినిమా అనౌన్స్ చేసిన పూరి జగన్నాథ్.. హీరో ఎవరంటే..

పూరీ జగన్నాథ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చాలామంది ఫిల్మ్ లవర్స్ కోరుకుంటున్నారు. అయితే ఆయన ఊహించని కాంబోతో ఉగాది వేళ గుడ్ న్యూస్ చెప్పారు. తమిళ హీరో విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం...

Puri Jagannadh: ఉగాది వేళ తన తదుపరి సినిమా అనౌన్స్ చేసిన పూరి జగన్నాథ్.. హీరో ఎవరంటే..
Puri Jagannath

Updated on: Mar 30, 2025 | 4:11 PM

పూరి జగన్నాథ్.. తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశారు. ఇటీవల వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ ఆయన తమిళ స్టార్ విజయ్‌ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఆదివారం ఈ వివరాలను నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం..  జూన్‌లో ప్రారంభమవుతుందని, మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలో ఇస్తామని మేకర్స్ తెలిపారు.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలలో ప్లాప్స్ అందుకున్నారు పూరి. దీంతో కాస్త టైం తీసుకుని మరీ ఈ కథను రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. పూరి జ‌గ‌న్నాథ్ గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా స‌రికొత్త జాన‌ర్‌లో విజ‌య్ సేతుప‌తితో మూవీ ఉండ‌బోతున్న‌ట్లు టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.